నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్  రికార్డులు మోత మోగించాయి.  గత కొంత కాలంగా బాలయ్యకు ఒక్కహిట్టు పడలేదు.. దాంతో మరోసారి బోయపాటినే నమ్ముకున్నాడు.  ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి ఫ్యాక్షన్ తరహా సినిమా రాబోతుంది.  దీనికి సంబంధించిన టీజర్ బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ మూవీలో హీగా ఉన్న సునీల్ కమెడియన్ గా యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.   యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ మిర్యాలగూడ రవీంద్రారెడ్డి నిర్మిస్తున్నారు.  

 

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి సునీల్ పాత్రను తీసేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో సునీల్ కి మంచి రోల్ ఉందని అన్నారు.  ఈ నేపథ్యంలో బోయపాటి.. అందుకోసం ఓ కామెడీ ఎపిసోడ్‌ని కూడా రాసుకున్నారట. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారట బోయపాటి. ఇక సునీల్ పాత్రను కట్‌ చేశారట దర్శకుడు. వాస్తవానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ఉంచాలనుకున్నా సినిమా సీరియస్ మోడ్ లో సాగుతుందట.. ఆ కారణంగా కామెడీకి పెద్ద పీఠ వేయలేకపోయారట. దాంతో  ఆ పాత్రను తీసేశారట.

 

దీంతో ఇప్పుడు ఈ సినిమా నుంచి సునీల్‌ని తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కమెడియన్‌గా దూసుకుపోతున్న సమయంలో హీరోగా మారిన సునీల్, తర్వాత సక్సెస్ అందుకోలేక చాలా కష్టాల్లొ పడ్డారు. దాంతో యూటర్న్ తీసుకొని మళ్లీ కమెడియన్ గా మారారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగైదు చిత్రాల్లో కీలక పాత్రల్లో కూడా నటించారు. కానీ అవేవీ ఆయన కెరీర్‌కి ఉపయోగపడలేదు. ఇలాంటి నేపథ్యంలో సునీల్‌కి ఇది పెద్ద షాక్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: