మన తెలుగులో సినిమాల విషయంలో సోషల్ మీడియా ముందు నుంచి కూడా అనేక విధాలుగా తన వంతు సహకార౦ అందిస్తోంది. సోషల్ మీడియా వచ్చిన నాటి నుంచి కూడా సినిమాలు జనాల్లోకి బలంగానే వెళ్తున్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా అవసరం ప్ర‌తి ఒక్క‌రికి త‌ప్ప‌నిస‌రి.. ఇంకా చెప్పాలంటే నిత్యావ‌స‌రం అయ్యింది. ఈ క్ర‌మంలోనే త‌మ‌ను తాము మ‌రింత ఎలివేట్ చేసుకునేందుకు... మ‌రింత పాపులారిటీ తెచ్చుకునేందుకు సోషల్ మీడియాతో ఇప్పుడు హీరోలకు ఎక్కువ అవసరం ఉంది.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఖర్చు తక్కువ తో పాటుగా ఎక్కువగా జనాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సినిమాల‌కు సంబంధించిన విష‌యాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకోవ‌డంతో అవి జ‌నాల్లోకి విప‌రీతంగా వెళుతుంటే.. మ‌రోవైపు త‌మ క్రేజ్ పెర‌గడంతో పాటు సినిమాల మార్కెట్ కూడా పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్, మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట, అలాగే పుష్ప సినిమాలను ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ఎక్కువగా తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. 

 

అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఎవరు అయినా సరే సోషల్ మీడియాను అన్ని విధాలుగా వాడుకుంటే మంచి లాభం ఉంటుంది అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోలు కూడా సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచే సోష‌ల్ మీడియాకు అవ‌స‌ర‌మైతే కొంత బ‌డ్జెట్ ప్ర‌త్యేకంగా కేటాయించి అయినా ముందు నుంచే ప్ర‌చారం చేయాల‌ని కండీష‌న్ పెడుతున్నార‌ట‌. అలాగే త‌మ సినిమాల టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌ను కూడా సోష‌ల్ మీడియాలో బాగా ప్ర‌చారం చేయించ‌డం ద్వారా వీరు రికార్డుల‌పై దృష్టి పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: