మెగా కాంపౌండ్ నుండి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోలలో ఒకరు అల్లు అర్జున్.. చైల్డ్  ఆర్టిస్టుగా  పరిచయమైన అతను గంగ్రోత్రి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..ఆ సినిమా హిట్ అవ్వడంతో  బన్నీ కి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి..అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా తన స్టయిల్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుంటున్నారు.. ఇక తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లలో బన్నీ పేరు మొదట  వినపడుతుంది... ఇకపోతే ఎన్నో హిట్ సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు.ఆయన సినిమాలలో ఆర్య, ఆర్య 2 సినిమాలు పాపులర్ అయ్యాయని చెప్పాలి..  

 

 

 

ఇది ఇలా ఉండగా బన్నీ సినిమాలలో ఎక్కువ సినిమాలు సోలో హీరోగా చేసి మంచి సక్సెస్ ను అందుకున్నారు.  ఎన్నో హిట్ సినిమాలు నటించాడు.. అయితే ఏ సినిమాలో కూడా మెగా హీరోల సరసన హీరోగా నటించలేదు. బన్నీతో మెగా హీరోలు నటిస్తే బాగుంటుందని మెగా అభిమానులతో పాటుగా అల్లు అర్జున్ అభిమానులు కూడా అభిప్రాయ పడుతున్నారు.. అయితే సినీ ఇండస్ట్రీలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడని టాక్ నడుస్తుంది.. మరి ఈ వార్త నిజమైతే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.. 

 

 

 

 ఇక బన్నీ సినిమా లు హిట్ అవ్వడానికి కారణం ఎంటో అన్నది చాలా మందికి డౌట్ అదేంటంటే అతని డైలాగ్ డెలివరీ టైమింగ్, దాంతో పాటుగా అతని స్టయిల్, డ్యాన్స్ వీటితో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది.. అయితే ఇంకా చెప్పాలంటే బన్నీ సినిమా కెరియర్ ను నిలబెట్టింది అవే.. ఒక్కో సినిమా లో ఒక్కో మ్యానరిజాన్ని చూపించడమే.. మరో ముఖ్య విషయమేంటంటే..జులాయి సినిమాలో నటించిన హీరో తన కామెడీతో, తెలివితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.దాంతో సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాక మంచి కలెక్షన్స్ కూడా రాబట్టి రికార్డును బ్రేక్ చేసింది.ఇటీవల బన్నీ నటించిన అల వైకుంఠపురం లో సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. ప్రస్తుతం బన్నీ , రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: