పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎన్నో మంచి సినిమా కథలు అతని వద్దకు కాళ్ళ దన్నుకొచ్చాయి. అందులో పోకిరి, అతడు, ఇడియట్, అమ్మ నాన్నతమిళ అమ్మాయి వంటి హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడం వలన మహేష్ బాబు పోకిరి, అతడు సినిమాలో హీరోగా నటించి తెలుగు రాష్ట్రాల్లో తన క్రేజ్ ని అంచలంచలుగా పెంచుకున్నాడు. రవితేజ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇడియట్, అమ్మ నాన్నతమిళ అమ్మాయి చిత్రాలలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకొని అగ్రహీరోగా ఎదిగాడు. 


ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ నాలుగు స్క్రిప్ట్ లకు ఓకే చెప్పినట్లైతే అతడి కెరీర్ లో అవి బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచేయేమో. ఈ సినిమాలన్నీ రిజెక్ట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ ఏదో ఒక సందర్భంలో బాధపడే ఉంటాడు. తమాషా ఏమిటంటే తనకి వచ్చిన మంచి కథలను రిజెక్ట్ చేసిన పవన్... వేరే హీరోలు రిజెక్ట్ చేసిన కథలకు మాత్రం ఓకే చెప్పాడు. ఫలితంగా తన ఖాతాలో ప్లాప్ లను వేసుకున్నాడు. ముఖ్యంగా పేరరసు( డైలాగులు), అబ్బూరి రవి రాసుకున్న ఓ అన్నాచెల్లెళ్ల స్టోరీ ని చూసిన పరుచూరి బ్రదర్స్... ఈ స్టోరీ బాలకృష్ణకు బాగా సూట్ అవుతుందని భావించి అతడిని సంప్రదించగా... అతడు మాత్రం ఆ స్టోరీ ని సున్నితంగా తిరస్కరించాడు. 


వాస్తవానికి ఆ సమయంలో బాలకృష్ణ వేరే సినిమాలలో కమిట్ మెంట్ అయ్యి చాలా బిజీగా ఉండి ఈ స్టోరీ ని వదిలేసుకున్నాడు. దాంతో పరుచూరి బ్రదర్స్ ఈ కథను పక్కన పెట్టగా... కొన్ని రోజుల తర్వాత అబ్బూరి రవి రచనలో సూపర్ గుడ్ ఫిలింస్ వారు కొన్ని మార్పులు చేసి పవన్ కళ్యాణ్ కి వినిపించారు. కథ నచ్చిన పవన్ వెంటనే సినిమాలో చేసేందుకు ఓకే చెప్పేసాడు. తదనంతరం దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు... అన్నయ్య పాత్రలో పవన్ కళ్యాణ్ ని, అతడికి సోదరి పాత్రలో సంధ్యని, ఆమెకి వరుడిగా శివ బాలాజీ ని, హీరోయిన్ గా ఆసిన్ ని, సైడ్ క్యారెక్టర్ గా వేణుమాధవ్ ని ఎంపిక చేసి... మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మాణంలో రూ.16 కోట్ల బడ్జెట్ తో చిత్రీకరణ పూర్తిచేసి, అన్నవరం అనే టైటిల్ ఖరారు చేసి 2006వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకి తెచ్చాడు. అయితే అన్నవరం చిత్రం మొదటి ఆట కే డిజాస్టర్ టాక్ ని అందుకుని పవన్ కళ్యాణ్ కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ విధంగా బాలయ్య వద్దన్న స్టోరీ కి ఓకే చెప్పి పవన్ కళ్యాణ్ పెద్ద తప్పు చేశాడని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: