మన తెలుగులో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే చాలా వరకు కూడా  హీరోయిన్ లు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి గాని చాలా మంది హీరోయిన్ ల విషయంలో దర్శక నిర్మాతలు కాస్త కఠినం గా వ్యవహరిస్తున్నారు అనే  ఆలోచనతో చాలా మంది వెనక్కు తగ్గుతున్నారు సినిమాలు చేయకుండా అనే ప్రచారం ఉంది.  ఈ తరుణంలో ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పూజ హెగ్డే కి ఒక నిర్మాతకు సినిమా విషయంలో గొడవ అయింది అని సమాచారం. మరి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆమె మాత్రం ఒక నిర్మాతతో గొడవ పడ్డారు అని తెలుస్తుంది. 

 

ఎందుకు ఏంటీ అనేది ఇంకా స్పష్టంగా తెలియదు గాని పారితోషికం విషయంలో మాత్రం ఆమెను బాగా ఇబ్బంది పెట్టడమే కాదు స్కిన్ విషయంలో  కూడా కాస్త ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారు అని తెలుస్తుంది. చిన్న చిన్న హీరోల సినిమాలను ఆమె చేయడం లేదు. అయితే ఒక సినిమాను కమర్షియల్ యాంగిల్ లో తీసుకుని రావాలి అని భావిస్తున్న ఒక స్టార్ నిర్మాత చిన్న హీరోతో లిప్ లాక్ అదే విధంగా కాస్త ఐటెం  సాంగ్ కొన్ని కొన్ని సన్నివేశాల్లో బోల్డ్  గా నటించాలి అని చెప్పడంతో ఆమె బాగా హర్ట్ అయింది అని టాక్. 

 

తాను అవసరం కోసం సినిమాలు చేయడం లేదు అని సినిమాలు తనకు  ఇష్టం అని అందుకే చేస్తున్నా అని దయచేసి ఇంకోసారి ఆ విధంగా మాట్లాడవద్దు అని ఆమె సూచనలు చేసినట్టు సమాచారం. మరి ఎంత వరకు నిజం అనేది తెలియదు. ఇప్పుడు ఆమె రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు లాక్ డౌన్ లో ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: