టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరో అయిపోయాడు నానీ. అతను ఈ మధ్య సినిమాల విషయంలో గతంలో చూపించిన విధంగా దూకుడు చూపించడం లేదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. గతంలో నానీ ప్రతీ ఏటా రెండు సినిమాలను విడుదల చేసాడు. నానీ సినిమాలు అనగానే జనాలకు కూడా ఒక రేంజ్ లో ఆసక్తి అనేది ఉంటుంది. అందుకే అతను కూడా చాలా వరకు వేగంగా సినిమాలు చేస్తూ ఉంటాడు అని అంటారు. ఇక అగ్ర దర్శకులు కూడా నానీ తో సినిమాలు  చెయ్యాలి అని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు నానీ కెరీర్ కాస్త ఆందోళన కరంగా ఉంది అని సమాచారం. 

 

టాలీవుడ్ లో అతను ఈ మధ్య కాలంలో బాగా ఇబ్బంది పడుతున్నాడు అని సమాచారం. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఇప్పుడు నానీ బాగా కథల విషయంలో ఇబ్బంది పడుతున్నాడు అనే వార్తలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల కథలను వినిపించినా సరే అతను నచ్చక వదిలేసాడు అని అంటున్నారు. అతనికి నిర్మాత అవ్వాలి అనే కోరిక ఉండేది అని కాని లాక్ డౌన్ దెబ్బకు నానీ బాగా ఇబ్బంది పడుతున్నాడు అని అంటున్నారు. అతను కొందరు దర్శకులతో సినిమాలు చెయ్యాలి అని చూసినా సరే కొందరు అతని విషయంలో అంతగా ఆసక్తి చూపించలేదు అని సమాచారం. 

 

అందుకే నానీ కూడా ఇప్పుడు చాలా వరకు జాగ్రతగా సినిమాలు చేస్తున్నాడు. నానీ  పారితోషికం కూడా భారీగా తగ్గించుకోవడమే కాదు వరుసగా సినిమాలను చెయ్యాలి అనే ప్లాన్ లో కూడా ఉన్నాడు అనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా మనకు వినపడుతున్నాయి. కాని అతనికి మంచి కథ మాత్రం ఇప్పటి వరకు సరిగా దొరకలేదు అనేది టాలీవుడ్ జనాల మాట. మరి చూడాలి ఏ విధంగా చేస్తాడో...

మరింత సమాచారం తెలుసుకోండి: