తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతో అలరిస్తూ ఉంటారు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ప్రస్తుతం యూత్ లో ఎక్కువగా  ఫాలోయింగ్ ఉన్న హీరో లలో మొదటి వరుసలో ఉంటారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే మొదటి నుంచి ప్రభాస్ తనలోని సరికొత్త కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో నటించి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఓవైపు తనదైన యాక్షన్ సన్నివేశాలతో అదరగొడుతునే  మరోవైపు అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు రెబల్ స్టార్ ప్రభాస్. 

 

 అయితే ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలు కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన  విషయం తెలిసిందే. డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, సాహో ఇలా చాలానే సినిమాలు యాక్షన్ ఎలిమెంట్స్ తో అదరగొట్టడంతో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ప్రభాస్ కెరీర్ లో చాలానే కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉన్నప్పటికీ ఆ ఒక్క సినిమా మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంటుంది. ఆ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. ప్రభాస్ నటించిన ఆ సినిమా చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వు కోవాల్సిందే. 

 

 ఇంతకీ ఆ సినిమా ఏది అనుకొంటున్నారా... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన మొట్టమొదటి సినిమా ఈశ్వర్. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అందరికీ ఇప్పటికీ గుర్తు ఉంటుంది. ఎలాంటి చదువు సంధ్యలు లేకుండా ఉండే ఒక యువకుడి  క్యారెక్టర్ లో ప్రభాస్ నటిస్తాడు. అలాంటి ప్రభాస్ ఒక బాగా  చదువుకున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇక ఆ అమ్మాయి ప్రేమను పొందడానికి ప్రభాస్ చేసే ప్రతి ప్రయత్నం కూడా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ప్రభాస్ కి తోడుగా ఉండే ఒక గ్యాంగ్ చేసే అల్లరి ఈశ్వర్ సినిమాలో  తెలుగు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూ ఉంటుంది. ఇలా  ప్రభాస్ ఎన్ని  ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసినప్పటికీ తన మొట్టమొదటి సినిమా ఈశ్వర్ మాత్రం ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: