తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు తమ పవర్ ఫుల్ డైలాగ్ లతో అదరగొట్టడంతో పాటు... తమదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని మరింతగా ఆకర్షిస్తున్నారు. తమ సినిమాలలో కమెడియన్స్ లేకున్నా పరవాలేదు అనిపించేలా తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని అద్భుతంగా ఆకట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో  తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోలలో ముందు వరుసలో ఉంటారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మొదటి నుంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలు చూసుకుంటే అన్ని కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే. 

 

 అయితే అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో నటించి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టినప్పటికీ... తెలుగు చిత్ర పరిశ్రమలో  అల్లు అర్జున్ కామెడీ తో కొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా మాత్రం రేసుగుర్రం సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ తనలోని సరికొత్త కామెడీ యాంగిల్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి విజయం సాధించాడు. ఇక రేసుగుర్రం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిచింది . ఇక రేసుగుర్రం సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది అనడంలో అతిశయోక్తి లేదు. 

 


 సినిమాలోని ప్రతి సన్నివేశం తో కూడా అల్లుఅర్జున్ సరికొత్త ట్రెండ్ సృష్టించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించి అదరగొట్టాడు అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజం  డైలాగ్ అయిన దేవుడా డైలాగ్ పరిశ్రమలో ట్రెండింగ్  గా మారిపోయింది. ఇక కొన్ని రోజులపాటు ఎవరి నోట చూసినా ఇదే డైలాగ్ వినిపించింది. కేవలం సినిమాల్లోనే కాదు బయట ప్రేక్షకులు కూడా ఈ డైలాగుతో ఎంతగానో కామెడీ పంచారు అని చెప్పాలి. ఇలా తనదైన డైలాగ్ డెలివరీతో అద్భుతమైన కామెడీతో తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించారు అల్లు అర్జున్. అంతే కాకుండా ఎక్స్ప్రెషన్ బయటికి కనిపించకుండా లోలోపల ఫీలయ్యే శృతి హాసన్ ని మార్చడానికి అల్లు అర్జున్ చేసే చిలిపి చేష్టలు కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: