తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది, సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు... ప్రస్తుతం స్టార్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక కథల ఎంపికలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు మహేష్ బాబు. అయితే ప్రస్తుతం కాస్త మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ ఒకప్పుడు మాత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు అని చెప్పాలి. ఇక మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ఏకంగా కమెడియన్స్ ని సైతం మైమరిపించేలా ప్రేక్షకులను ప్రభావితం చేస్తాడు. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. 

 


 ముఖ్యంగా మహేష్ బాబు నటించిన సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించిన  సినిమాలలో మొదటి వరుసలో ఉండే సినిమా ఖలేజా. ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ చూస్తే కమెడియన్స్ కూడా మహేష్ బాబు టైమింగ్ ముందు పని చేయరేమో  అనిపిస్తూ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతూ  ఉంటాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అనుష్క నటించింది. ఈ సినిమాలో దాదాపుగా ఎక్కువ  సన్నివేశాలు అనుష్క... మహేష్ బాబు అలీ మధ్య సాగి పోతూ ఉంటాయి. 

 


 ఓ వైపు మహేష్ బాబు కామెడీ టైమింగ్... మరోవైపు ఆలీ, ఇంకోవైపు సునీల్ ఇలా ఈ ముగ్గురు కలిసి అద్భుతమైన కామెడీని పండించి ప్రేక్షకులను సినిమా చూస్తున్నంతసేపు కడుపుబ్బ నవ్వించారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఫుల్ టైం కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన చిత్రం దూకుడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మహేష్ బాబు తన తండ్రి కోసం ఏకంగా పొలిటీషియన్ గా నటిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో మహేష్ బాబు తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ ఉంటాడు. ఇక బ్రహ్మానందం మహేష్ బాబు మధ్య జరిగే సన్నివేశాలలో కామెడీ అద్భుతంగా పండించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది అనే చెప్పాలి. ఈ రెండు సినిమాలు మహేష్ బాబు  లోని సరికొత్త కామెడీ యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: