తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు తమ యాక్షన్ తో  అదరగొట్టడంతో పాటు తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా ప్రస్తుతం ఉన్న చాలా మంది హీరోలు ఓవైపు యాక్షన్.. మరోవైపు కామెడీ తో కూడా అదరగొడుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు చాలా మంది తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిలో మొదటి నుంచి కామెడీ టచ్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఓ వైపు పవర్ ఫుల్ డైలాగ్ లతో అలరిస్తూనే మరోవైపు అదిరిపోయే కామెడీ టైమింగ్ తో కామెడీని పండిస్తూ ఉంటాడు సాయి ధరంతేజ్. 

 


 ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ నటించిన అన్ని సినిమాలు  మంచి ఎంటర్టైన్మెంట్ పంచాయి అనడంలో  అతిశయోక్తి లేదు. ముఖ్యంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమాలను ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుండిపోయే సినిమాలలో మాత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు అని చెప్పాలి. ఈ సినిమాలు సాయి ధరమ్ తేజ్ సరసన రెజీనా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో రెజీనా సాయి ధరంతేజ్ మధ్య వచ్చే ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు... ముఖ్యంగా బ్రహ్మానందం సాయి ధరమ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి అని చెప్పాలి. 

 

 ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో  డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు సాయిధరమ్ తేజ్ . డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో  సాయి ధరంతేజ్ క్యారెక్టర్ ఎంతో ఆసక్తిగా సాగిపోతుంది. తన క్యారెక్టర్ లో సాయి ధరంతేజ్ డైలాగులు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మానందం సాయి ధరంతేజ్ మధ్య  కామెడీ టైమింగ్ తో అదిరిపోతుంది . ఈ సినిమాలో ఓ వైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పండిస్తూనే  మరోవైపు కామెడీ టైమింగ్ తో కూడా ఎంతో మందిని ఆకర్షించి కడుపుబ్బా నవ్వించాడు సాయి ధరంతేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: