బాలీవుడ్ లోకి జూనియర్ ఎన్టీఆర్ అడుగు పెడుతున్నాడు అనగానే చాలా మందికి ఏ సినిమా చేస్తాడు ఏ కథ తో సినిమా చేస్తాడు అనే ఆసక్తి ఉంది. అతనికి బాలీవుడ్ లో క్రేజ్ అనేది ఉంది అనే విషయం కొన్ని రోజులుగా వార్తలో వస్తూనే ఉంది. అయితే అతను మాత్రం చాలా వరకు ఇక్కడ మాత్రమే సినిమాలు చేయడం జరుగుతుంది. బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా అక్కడి అగ్ర దర్శకులు చిన్న దర్శకులు ఎవరు అడిగినా సరే అతను మాత్రం అక్కడ చిన్న పాత్ర కూడా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. 

 

అతను అక్కడ సినిమా చేస్తే భారీ బడ్జెట్ తో చేద్దామని కొందరు ఎదురు చూస్తున్నా అతను మాత్రం సినిమాలు చేయడం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు బన్సాలి దర్శకత్వంలో అతను సినిమా చేసే అవకాశం ఉంది అని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. బన్సాలి తో ఒక సినిమా చేస్తాడు అని అతను అక్కడ భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అన్నారు. అయితే అది నిజమా కాదా అనేది మాత్రం ఎవరికి స్పష్టత లేదు. దీనిపై ఇప్పటి వరకు ఏ స్పందన కూడా టాలీవుడ్ వర్గాల్లో రాలేదు. తారక్ కూడా దీని మీద ఏమీ మాట్లాడలేదు. 

 

అయితే దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగింది అని తెలుస్తుంది. అక్కడ సినిమా చేయడానికి గానూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి అని  ఈ సినిమాను దాదాపు రెండేళ్ళ పాటు షూట్ చెయ్యాల్సి ఉంటుందని అందుకే తారక్ ఆలోచనలో పడ్డాడు అనేది కొందరి మాట. మరి నిజమా కాదా అనేది చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: