తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వర్గానికి చెందిన స్టార్ హీరోలు కూడా విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ లిస్ట్ లో ఎక్కువగా కన్నడ, తమిళ స్టార్లు ఉండడం విశేషం. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయకులతో ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ స్టార్ హీరోలు. ఇక అతి త్వరలోనే మహేష్ సినిమా కోసం కూడా ఒక స్టార్ హీరో ప్రధాన నాయకుడి పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 


ఇకపోతే ఆ హీరో ఎవరో కాదు... కన్నడ స్టార్ హీరో సుదీప్. అదేనండి మన రాజమౌళి దర్శకుడిగా వహించిన ఈగ సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు విలన్ గా కనిపించి మంచి గుర్తింపు అందుకున్న సుదీప్. ఇక ఇటీవల బాహుబలి సైరా సినిమాలో కూడా స్పెషల్ రోల్ లో నటించి ప్రేక్షకుల ఆదరణను పొందాడు ఈ కన్నడ స్టార్ హీరో. కన్నడ ఇండస్ట్రీలో మంచి స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా ఇతర భాషలలో కూడా విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధం అవుతాడు. సుదీప్ దబాంగ్ త్రీ లో కూడా విలన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

 


ఇక మహేష్ బాబు తర్వాతి సినిమా సర్కార్ వారి పాట సినిమా లో కూడా అ సుదీప్ విలన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక తెర పై మహేష్ బాబు, సుదీప్ లాంటి స్టార్ హీరోలను ఒకేసారి చూపిస్తే ఆ వేడి వాడి తట్టుకోగలమా. ఇక సుదీప్ విలన్ పాత్రలో ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తారు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక మరోవైపు మహేష్ తన హై రేంజ్ లో హీరోయిజం ఇవ్వటంలో దిట్ట. అందుకేనేమో దర్శకుడు పరుశురాం సుదీప్ ను సెలక్ట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: