టాలీవుడ్ లో రామ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అతని సినిమాలు ఏ విధంగా ఉన్నా సరే కొందరు ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా హాల్ కి వెళ్లి చూసే పరిస్థితి అయితే టాలీవుడ్ లో ఉంటుంది. చిన్న చిన్న హీరోల సినిమాల్లో అతని సినిమాలకు మంచి ఆదరణ ఉంది. సినిమా హిట్ ఫ్లాప్ తొ సంబంధం లేకుండా ఎక్కువగా సినిమాలను చేస్తూ ఉంటాడు అనే సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను కెరీర్ లో భాగా ఇబ్బంది పడుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని అతను మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాడు. 

 

అతను నటించిన రెడ్ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉండి కూడా విడుదల కావడం లేదు. ఇక ఓటీటీ విషయంలో అతనికి నిర్మాతకు దర్శకుడికి గొడవ అవుతుంది అని సమాచారం. దీనితో రామ్ ఇప్పుడు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది. అతను ఇప్పుడు గ్యాప్ ఇచ్చి కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని గ్యాప్ తీసుకుని సినిమాలు చెయ్యాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎంత వరకు అతను సినిమాల్లో గ్యాప్ తీసుకుంటాడో చూడాలి. 

 

నిర్మాత దర్శకుడు ఇద్దరూ కూడా సినిమాను ఓటీటీ లో విడుదల చెయ్యాలి అని చూస్తున్నారు అని కాని అతను మాత్రం అవసరం అయితే సినిమాకు సంబంధించిన పెట్టుబడి మొత్తం ఇచ్చేస్తా అని తనకు సినిమా ఇవ్వాలి అని కోరినట్టు తెలుస్తుంది. మరి దీనిపై దర్శక నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి అని అందుకే అతను వేరే సినిమాల మీద ఫోకస్ చేయడం లేదు అని అంటున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: