టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక. ఆమె సినిమాలు ఆమెకు మంచి పేరు ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఆమె అనే విషయం అందరికి తెలిసిందే. ఆమె నటన తో పాటుగా ఆమె అందం కూడా ఇప్పుడు చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది వాస్తవం. ఇక అది  అలా ఉంటే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. ఆమె అందం విషయంలో కాస్త జాగ్రత్త పడుతుంది అని సమాచారం. 

 

ఇక నుంచి స్కిన్ షో వద్దు అనే ఆలోచనలో ఆమె ఉంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. ఇటీవల ఆమె పుష్ప సినిమాలో ఒక పాటలో ఐటెం సాంగ్ చెయ్యాలి అని భావించినా సరే ఆమె మాత్రం అందుకు నో చెప్పింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె నో చెప్పడానికి కారణం ఏంటీ అనేది స్పష్ట౦గా తెలియదు గాని అసలు స్కిన్ షో అనే ఆలోచన తనకు లేదు అని ఇప్పటి వరకు తప్పు చేశా అనే విధంగా మాట్లాడింది అని టాక్. అయితే ఆమె విషయంలో ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. 

 

ముందు ఓకే చెప్పి తర్వాత నో చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న టాలీవుడ్ లో కొందరి నుంచి ఎక్కువగా ఇప్పుడు వినపడుతుంది. ఇది ఎంత మాత్రం భావ్యం కాదని ఆమెను అంటున్నారు అని సమాచారం. టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే హీరోయిన్ లు డిమాండ్ చేసే అవకాశం అయితే దాదాపుగా లేదు అనే చెప్పాలి. మరి ఆమె ఏ విధంగా ఇప్పుడు డిమాండ్ చేస్తుంది అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: