అగ్ర హీరోయిన్ లతో సినిమాలు చేయడం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా వరకు కష్టంగా ఉంది అనే చెప్పాలి. చిన్న హీరోయిన్ లు చాలా బెస్ట్ అనే విధంగా పరిస్థితి ఉంది అది ఏ భాషలో అయినా సరే. మన తెలుగులో ఇది ఇంకా కష్టంగా ఉంది అని వార్తలు వస్తున్నాయి. వయసు మీద పడుతున్నా సరే కొందరు హీరోయిన్ లు ఇప్పుడు సినిమాల విషయంలో దూకుడుగానే ఉన్నారు. అగ్ర హీరోయిన్ లు చిన్న హీరోయిన్ లు అందరూ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకునే పేరు కాజల్. 

 

పాపకు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. వరుసగా సినిమాలు చేస్తుంది. ఆమె సీనియర్ హీరోయిన్ అయినా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా దూకుడు తగ్గించడం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చిన్న చిన్న హీరోల సినిమాలకు కూడా ఆమె ఓకే చెప్తుంది. ఇక అది అలా ఉంటే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి ఏమైనా ఆఫర్లు వస్తే ఆమె మాత్రం ఇప్పుడు దూకుడుగా ధరలను చెప్తుంది అని అంటున్నారు. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే కోటి పైగా ఆమె డిమాండ్ చేస్తుంది అని టాక్. 

 

ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఆమెను బాలయ్య సినిమాలో తీసుకోవాలి అని చూసినా సరే ఆమె మాత్రం భారీగా డిమాండ్ చేయడం తో బాలకృష్ణ కూడా షాక్ అయ్యారు అని సమాచారం. అసలే ఆయన చాలా తక్కువ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయన సినిమాలకు అంతగా డిమాండ్ చేస్తే ఆమెను తీసుకున్నా సరే అనవసరం అని భావి౦చి పక్కన పెట్టి వేరే వారిని తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: