టాలీవుడ్ లో ఇప్పుడు సీనియర్ హీరోలకు హీరోయిన్ లు దొరకడం చాలా కష్టంగా ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సీనియర్ హీరోలు చాలా మంది ఇప్పుడు  సినిమాలను వేగంగా చేస్తున్నారు. అగ్ర హీరోలు చిన్న హీరోలు అందరూ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. చిన్న హీరోలతో పోటీ పడి ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితి ఉంది స్టార్ హీరోలు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆపని లేదు. అగ్ర హీరోలకు హీరోయిన్ లు చాలా కష్టంగా ఉన్నారు అని చిన్న హీరోలకు ఉన్న  ఆసక్తి పెద్ద హీరోల విషయంలో హీరోయిన్ లు చూపించడం లేదు అని తెలుస్తుంది. 

 

ఇటీవల చిరంజీవి ఆచార్య సినిమా కోసం హీరోయిన్ ని ఎంపిక చెయ్యాలి అని భావించి చాలా మంది పేర్లను పరిశీలించిన తర్వాత ఎంపిక చేసారు. ఇప్పుడు కూడా దాదాపు బాలకృష్ణ విషయంలో అదే జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి. అగ్ర హీరోలను అసలు హీరోయిన్ లు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు అని సమాచారం. చిన్న చిన్న హీరోలు అందరూ కూడా వరుసగా సినిమాలు చేయడంతో వారి మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే వారితో సినిమాలు చేయడమే మంచిది అని భావిస్తున్నారు. 

 

ఇక వెంకటేష్ తో కూడా సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అని తెలుస్తుంది. మరి ఎవరితో సినిమాలు చేస్తారు అనేది చూడాలి. ఇక చిరంజీవి తర్వాతి సినిమాకు కూడా హీరోయిన్ దొరకడం చాలా కష్టంగా ఉఇంది అని సమాచారం. అగ్ర హీరోల పరిస్థితి మరీ దారుణంగా ఉంది అనే ఆవేదన నిర్మాతలు దర్శకులు అందరిలో వ్యక్తమవుతుంది అని తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఏ విధంగా పరిస్తితితులు ఉంటాయి అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: