టాలీవుడ్ లో ఎన్నో మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు వచ్చాయి. ప్రత్యేకించి మహిళల్లో ఉత్తేజాన్ని నింపే కథాంశాలు ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుత జనరేషన్ లో కూడా మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు వస్తున్నాయి. మాస్ డైరక్టర్ గా తిరుగులేని పూరి జగన్నాధ్ ఓ మహిళా ప్రాధాన్యం సినిమా చేస్తే అద్భుతమే. కానీ.. ఆయన చేస్తారా.. అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ‘జ్యోతిలక్ష్మీ’ అనే పవర్ ఫుల్ సినిమాను తెరకెక్కించారు తన మార్క్ చూపించారు. ఛార్మీ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమా నేటితో 5ఏళ్లు పూర్తి చేసుకుంది.

IHG

 

నటిగా ఛార్మీకి ఆఖరు సినిమాగా నిలిచిన ‘జ్యోతిలక్ష్మి’ 2015 జూన్ 12న విడుదలైంది. ఈ సినిమాలో చార్మి వేశ్య పాత్రలో నటించింది. హీరోయిన్ గా అప్పటికే దశాబ్దానికి పైగా ఎన్నో సినిమాలు చేసింది చార్మి. కానీ.. ఈ సినిమా ఆమెకు డిఫరెంట్. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. పైగా.. వేశ్య పాత్ర. చార్మీ తన పాత్రను అద్భుతంగా చేసింది. వేశ్య అని తెలిసినా తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో వైవాహిక జీవితం గడపాలనుకుంటుంది. కానీ.. తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తారు కొందరు. భర్తను కాపాడుకునే పాత్రలో చార్మీ తన నటనతో ఆకట్టుకుంటుంది.

IHG

 

నటిగా తనలో ఉండే ఫైర్ ని తీసుకొచ్చి సినిమాకు ప్లస్ గా నిలిచింది. ‘నటిగా నా ఆఖరు సినిమాను మంచి గుర్తుండిపోయే పాత్ర ఇచ్చారు పూరి. ఇందుకు నిర్మాత సి.కల్యాణ్ గారూ సహకరించారు. నిర్మాతగా కూడా ఇదే నా తొలిసినిమా. నటి నుంచి ప్రొడక్షన్ కు మారిన అవకాశం జ్యోతిలక్ష్మి కల్పించింది. అందరికీ ధన్యవాదాలు’ అంటూ చార్మి తన ట్విట్టర్ అకౌంట్ లో తన అనుభవాలు పంచుకుంది. పూరి కనెక్ట్స్, సీకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: