కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా స్టార్ హీరోల సినిమాల మీద కూడా ప్రభావం పడింది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, యంగ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి నటించిన గులాబో సితాబో సినిమా డిజిటల్‌లో రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాకు మిక్స్‌డ్‌ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ మూవీ రిలీజ్ సందర్భంగా యంగ్ హీరో ఆయుష్మాన్‌ స్పందించాడు. బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించటంపై భావోద్వేగంగా స్పందించాడు.

 

`మన దేశంలో ఓ యువకుడు సినిమాల్లోకి రావాలి అనుకుంటే అతని గోల్ ఖచ్చితంగా అమితాబ్‌ బచ్చన్ స్థాయికి రావటమే అయ్యుంటుంది. నా గత చిత్రంలో ఓ డైలాగ్ కూడా ఉంది బచ్చన్‌ను తయారు చేయలేరు అలా పుట్టాలి అంతే. నేను టీవీ కోసం చేసిన తొలి షో షూట్‌ ముఖేష్ మిల్‌ లో జరిగింది అక్కడే అమితాబ్‌ బచ్చణ్ చుమ్మా చుమ్మా దేదే సాంగ్‌ను షూట్ చేశారు.

 

అలాంటి ది ఇప్పుడు ఆ మెగాస్టార్ గులాబో సితాబో సినిమాలో నాతో కో స్టార్‌గా పనిచేస్తున్నాడు. సినిమాలో మా ఇద్దరి మధ్య జరిగి సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ఇక నిజజీవితంలో అమితాబ్‌ లాంటి వారి గురించి నేనేం చెప్పలేనని చెప్పాడు ఆయుష్మాన్‌. అంతేకాదు అంతటి మెగాస్టార్‌తో నటించే అవకాశం కల్పించిన సుజిత్‌ సర్కార్‌కు కృతజ్ఞతలు అంటూ కామెంట్ చేశాడు ఆయుష్మాన్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

जब भी हमारे देश में कोई नौजवान अभिनय के क्षेत्र में कदम रखना चाहता है तो उसका ध्येय होता है अमिताभ बच्चन। मेरी आख़िरी फ़िल्म में एक dialogue था कि बच्चन बनते नहीं है, बच्चन तो बस होते हैं। जब मैंने बचपन में चंडीगढ़ के नीलम सिनमा में “हम” देखी थी और बढ़े से बच्चन को बढ़े से पर्दे पर देखा था तो शरीर में ऐसी ऊर्जा उत्पन्न हुई जिसने मुझे अभिनेता बनने पर मजबूर कर दिया। मेरा पहला tv शूट मुकेश मिल्ज़ में हुआ था और यही वो जगह थी जहां जुम्मा चुम्मा दे दे शूट हुआ था। उस दिन मुझे I have arrived वाली feeling आ गयी थी। अगर तब यह हाल था तो आज आप सोच सकते होंगे मैं किस अनुभूति से गुज़र रहा होऊँगा। गुलाबो सिताबो में मेरे सामने बतौर ‘सह’ कलाकार यह हस्ती खड़ी थी और किरदारों की प्रवृति ऐसी थी की हमें एक दूसरे को बहुत ‘सहना’ पड़ा। वैसे असल में मेरी क्या मजाल की मैं उनके सामने कुछ बोल पाऊँ। इस विसमयकारी अनुभव के लिए मैं शूजित दा का धन्यवाद करना चाहूँगा की उन्होंने मुझे अमिताभ बच्चन जैसे महानायक के साथ एक फ़्रेम में दिखाया है। दादा आप मेरे गुरू हैं, आपका हाथ थाम कर यहाँ तक पहुँचा हूँ। “सौ जन्म क़ुर्बान यह जन्म पाने के लिए, ज़िंदगी ने दिए मौक़े हज़ार हुनर दिखाने के लिए।” -आयुष्मान 🙏🏻 Catch #GiboSiboOnPrime today!

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

మరింత సమాచారం తెలుసుకోండి: