సునీల్ పేరు చెప్పగానే మనకు ఎక్కువగా అతని చిలిపి నవ్వు, హాస్యభరితమైన సన్నివేశాలు టక్కున్న గుర్తొస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి హీరో పక్కన కామెడీ పాట్నర్ గా దూసుకెళ్లిన మన బంక్ శీను తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. 2002వ సంవత్సరం నుండి 2009 వరకు ప్రతి ఒక్క సంవత్సరంలో ఏకంగా 10-15 సినిమాల్లో నటించి బ్రహ్మానందం తర్వాత అత్యంత బిజీగా ఉన్న తెలుగు కమెడియన్ గా పేరుపొందాడు. కానీ 2010వ సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న సినిమాలో హీరో గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ చిన్నపాటి కామెడీ పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపలేదు. 2012 సంవత్సరంలో పూలరంగడు సినిమాలో హీరోగా నటించి తన ఖాతాలో హిట్ వేసుకున్నాడు కాని ఆ తర్వాత తాను హీరోగా నటించిన ప్రతి ఒక్క చిత్రం డిజాస్టర్ టాక్ ని సంపాదించింది. 


ఏడు సంవత్సరాల పాటు హీరోగా నిలదొక్కుకుందామని సునీల్ ఎంతగానో ప్రయత్నించాడు కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం అతడిని హీరోగా అస్సలు అంగీకరించలేదు. దాంతో మళ్ళీ కమెడియన్ గా అవతారమెత్తాడు కానీ అతడిలో ఏదో లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సునీల్ తనను తాను ఒక ఫెయిల్యూర్ లాగా భావిస్తున్నట్టు ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఇది కూడా తెలుసుకున్న సునీల్ కామెడీ పాత్రలలో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను సునీల్ ని సంప్రదించి తన సినిమాలో ఒక నెగటివ్ రోల్ ఇచ్చారట. బోయపాటి శ్రీను అమాయకంగా కనిపించే సీనియర్ హీరో జగపతి బాబు ని విలన్ గా చూపించి అతడి సినీ కెరియర్ ని మళ్లీ గాడిలో పెట్టి అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇదే తరహాలో సునీల్ ని కూడా విలన్ గా చూపించి అతడి కెరియర్ ని మార్చపోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. 


ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ తో కలిసి ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ కి ఒక కీలకమైన నెగిటివ్ రోల్ ఇవ్వగా.... కామెడీ పాత్రలకు అతడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో దానికి రెట్టింపు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట నిర్మాతలు. బాలయ్య కు విలన్ గా సునీల్ నటించడం అనేది ఒక ఆసక్తికరమైన విషయం. ఇప్పటివరకు సునీల్ ని నెగెటివ్ రోల్ లో సీరియస్ గా ఏ దర్శకుడు చూపించలేదు. కానీ బోయపాటి శ్రీను అతడి తో ప్రయోగం చేయడం ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: