నేటితారలు సామజిక సేవలు అందించడంలో ముందజలో ఉంటున్నారు. ఈ అందాల భామలు తమ వంతుగా ప్రజలలో చైతన్యని కలిగిస్తూన్నారు. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఆమె ఎవరో కదండీ బోనీ రైట్. హ్యారీ పోటర్ లో ముద్దులొలికే చిన్నారిగా కనిపిస్తూనే, స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయిన ఈ భామ. ఇప్పుడు ఈ భామ సెలక్టివ్ సినిమాలు చేస్తూనే, చదువుల్లోనూ చురుగ్గా రాణిస్తోంది. హాలీవుడ్ లో పెద్ద చదువులు చదివిన అతి కొద్దిమంది నటీమణుల్లో అమ్మడి పేరు ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. సాధారణంగా కాంట్రావర్సీలకు దూరంగా ఉండే  బోనీ రైట్తా జాగా హిజ్రాలకు తన మద్దతును తెలుపుతూ వార్తలకు ఎక్కింది.

 

 

ట్రాన్స్ జెండర్ లకు తన మద్దతు తెలుపుతూ ట్విట్టర్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. హిజ్రాలకు కూడా సాధారణంగా జీవించే హక్కు ఉందని ట్వీట్ చేసిన బోనీ, వారిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టంచేసింది. తాను ట్రాన్స్ జెండర్లకు ఆర్థిక సహాయం చేస్తున్న పలు సంస్థలకు విరాళాలు అందజేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, వారు ఎలా ఉన్నా, హిజ్రాల పట్ల తనకు ఎంతో గౌరవమర్యాదలు ఉన్నాయని తెలిపింది. వారంటే తనకు ఎంతో అభిమానమని వెల్లడించింది.

 

 

జేకే రౌలింగ్ ట్వీట్ కు వ్యతిరేకంగా ఇప్పటికే, హ్యారీ పోటర్ కథానాయకుడు డేనియల్ రాడ్ క్లిఫ్ తో పాటూ, అదే సినిమాలో నటించిన పులువురు ట్వీట్ చేశారు. తాము ట్రాన్స్ జెండర్లకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అయితే వీరిలో ఎవరూ కూడా, జేకే రౌలింగ్ పేరుగానీ, ఆమె చేసిన ట్వీట్ ను గానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇప్ప‌టికే హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా వాట్స‌న్‌ ట్రాన్స్‌జెండ‌ర్‌ల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ సందేశం పంపిన విష‌యం తెలిసిందే. హిజ్రాలకు సాధార‌ణంగా జీవించే హ‌క్కు ఉంద‌ని తెలుపుతూ వారికోసం పాటుప‌డే సంస్థ‌ల‌కు విరాళం అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది ఈ భామ.

మరింత సమాచారం తెలుసుకోండి: