అందం ఎక్కడ ఉంది అంటే అంతా ఉందని అంటుంది. ఆ బ్యూటీ పేరే నభా నటేష్.  తొలి చిత్రం రెండేళ్ళ క్రితం వచ్చిన నన్ను దోచుకుందువటే. ఈ మూవీ లో హీరో సుధీర్  బాబు. ఆయన పక్కన నటించి నభా తెలుగు వారి గుండెలను దోచేసుకుంది. ఆ తరువాత అవకాశాలు వెల్లువలా వస్తాయని ఆశించింది. 

IHG

అయితే రాలేదు.కానీ నభా హాట్ బ్యూటీ అని మాత్రం అంతా గుర్తించారు. మరి నభా టాలెంట్ ని బ్యూటీని మొత్తం వెండితెర మీద పరచేసిన ఘనత మాత్రం డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కే దక్కుతుంది. ఈ మూవీలో పూరీ నభా నెరజాణతనం అంతా చూపించాడు.

IHG

దాంతో నభాకు వరసగా చాన్సులు ఇపుడు వస్తున్నాయి. సోలో బతుకే సో బెటర్ అంటూ మెగా మేనల్లుడు సాయి తేజ్ తో నభా జట్టు కట్టింది. ఈ మూవీ రిలీజ్ కి సిధ్ధంగా ఉంది. ఈ మూవీతో తనకు మళ్ళీ సూపర్ హిట్ వస్తుందని నభా కోటి ఆశలు పెట్టుకుంది.

IHG

మూవీ తరువాత నభా ఇపుడు నితిన్ సరసన కొత్త మూవీలో సెలెక్ట్ అయింది.  'అంధాదూన్' హిందీ చిత్రాన్ని తెలుగులో నితిన్ రీమేక్ చేయనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కథానాయికగా నభా నటేష్ కనిపిసోంది. సో ఈ మూవీతో నభా మరింతగా ముందుకు దూసుకురానుంది. 

IHG

ఇదిలా ఉండగా నభా స్టార్ డం కోసం గట్టిగా ట్రై చేస్తోంది. స్టార్ హీరోల పక్కన చాన్సుల కోసం ఆమె తెగ ట్రై చేస్తోంది. తన హాట్ పోజులతో ఇన్స్టాగ్రాం ని కూడా కిర్రెక్కించేస్తోంది. అయితే నభాకు మిడిల్ ఏజ్ హీరోలు, కుర్ర హీరోలు తప్ప టాప్ రేంజి హీరోలు మాత్రం ఆఫర్లు ఇవ్వడంలేదు.

IHG

అందం చందం అన్నీ ఉన్న నాకేం తక్కువ అంటూ నభా తెగ ఫీల్ అవుతోందిట. ఇస్మార్ట్ శంకర్ తరువాత నభా స్టార్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ మీడియం రేంజి హీరోలే ఆమెకు ఆఫర్లు ఇస్తున్నారు. ఇపుడు నితిన్ మూవీతోనైనా తన ఆశలు నెరవేరుతాయని భావిస్తోందిట.  మొత్తం మీద నభా అందాలతో మళ్ళీ కుర్రకారుని పిచ్చెక్కించడానికి రెడీ అంటోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: