కూతురు ఫస్ట్ క్లాస్ కూడా కంప్లీట్ చేయలేదు గానీ.. అప్పుడే అర్హ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు అల్లు అర్జున్. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోమంటూ రిక్వెస్టులు పెడుతున్నాడు. దానికి అర్హ నుంచి వింత సమాధానాలు వస్తున్నాయి. మరి బన్ని అప్పుడే అర్హ పెళ్లి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాడు. 

 

అల్లు అర్జున్ పార్టీ గాయ్ లా కనిపిస్తాడు గానీ.. పక్కా ఫ్యామిలీ మేన్. సినిమాలు లేకపోతే పిల్లలతో గడుపుతాడు. ఫ్రెండ్లీ ఫాదర్ లా కలిసి అల్లరి చేస్తాడు. కొడుకు అయాన్, కూతురు అర్హతో కలిసి చైల్డ్ లైఫ్ లోకి వెళ్లిపోతుంటాడు. అయితే ఆటలతో పాటు కొన్నిసార్లు ఫన్నీ కన్జర్వేషన్స్ కూడా చేస్తుంటాడు బన్నీ. ముఖ్యంగా అర్హను నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఫుల్ రిక్వెస్టులు పెడుతుంటాడు. 

 

అల్లు అర్జున్ అప్పటి నుంచి అర్హాని ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని బ్రతిమాలుతూనే ఉన్నాడు. కానీ అర్హ మాత్రం నాన్న రిక్వెస్టులను పట్టించుకోవడం లేదు. రీసెంట్ గా మరోసారి అర్హాని పెళ్లి గురించి అడిగాడు బన్నీ. 374వ ప్రయత్నంగా కూతురిని ఎరేంజ్డ్ మ్యారేజ్ కి ఓకే చెప్పించే ప్రయత్నం చేశాడు కానీ ఇప్పుడు కూడా అర్హ ఒప్పుకోలేదు. ఈ ప్రయత్నాలనే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. 374వ సారి నాన్న ట్రైల్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియో అప్ లో్ చేశాడు. 

 

అల్లు అర్జున్ ది లవ్ మ్యారేజ్. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బన్నీ. లవ్ మ్యారేజ్ చేసుకున్న బన్నీ, కూతురిని ఎరేంజ్డ్ మ్యారేజ్ కు ఒప్పించే ప్రయత్నాలు చేయడం నెటిజన్లకు కొంచెం వింతగా కనిపిస్తోంది. అల్లు శిరీష్ అర్హా వెర్షన్ అంటూ మై లైఫ్ మై రూల్స్ అని కామెంట్ పెట్టాడు. సో ఈ పోస్టులు, కామెంట్లు చూసి అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫుల్ ఛిల్ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: