తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు వారి వారసుడిగా మెగా మేనల్లుడి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులందరికీ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు. అయితే  ప్రతి సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ ఎంతో  డిఫరెంట్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల స్టైలిష్ స్టార్ కాబట్టి  అల్లు అర్జున్ ఎంట్రీ అంతే స్టైల్ గా ఉంటుంది. ప్రతి సినిమాలో సరికొత్తగా ప్రయత్నిస్తూ ఉంటాడు అల్లు అర్జున్. ఇలా కొన్ని సినిమాలలో అల్లు అర్జున్ ఎంట్రీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి అనే చెప్పాలి. 

 

 ఇలా అల్లు అర్జున్ ఎంట్రీ లలో తెలుగు ప్రేక్షకులందరికీ ఆల్టైమ్ ఫేవరెట్ అయిన ఎంట్రీ మాత్రం రేసుగుర్రం సినిమాలో ఉంటుంది. రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ పోలీస్ పాత్రలో  ఎంట్రీ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు... ఒక్కసారిగా విజిల్స్ వేసేంతలా ప్రభావితం  చేస్తుంది ఆ ఒక్క సీన్. శృతిహాసన్ అల్లు అర్జున్ ఫ్యామిలీ కార్లో వెళుతున్న సమయంలో... కార్ కి ఆక్సిడెంట్ చేసి ఆ తర్వాత ఆ రౌడీలు తమ కార్ తో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉన్న కారును ఢీకొట్టేందుకు  స్పీడ్ గా వస్తున్న టైంలో.. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని  ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో... అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తాడు. 

 


 అది కూడా సాదాసీదాగా కాదు... అప్పటివరకు ఆవారా గా ఉన్న అల్లు అర్జున్ ఒక్కసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చి ఒక స్టైలిష్ బైక్ పై ఎంతో స్టైల్ గా ఎంట్రీ ఇస్తాడు అల్లు అర్జున్. ఏం జరుగుతుంది అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు అందరూ అల్లు అర్జున్ ఎంట్రీ తో విజిల్స్ వేస్తారురు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సీన్ ఎన్నిసార్లు చూసినా ప్రేక్షకులు  విజిల్స్ వేస్తూనే ఉంటారు. అంతలా తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేసింది ఈ ఒక్క సీన్. తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: