తెలుగు చిత్ర పరిశ్రమలో  సినిమాలు ఎన్ని వచ్చినప్పటికీ ఆ సినిమాల్లో  ప్రేక్షకులకు గుర్తుండిపోయే సన్నివేశాలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి  మనసులో స్థానం సంపాదించిన సన్నివేశాలలో ఒకటి అల వైకుంఠపురములోని సినిమాలోని  ఓ సన్నివేశం. అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది ఈ సినిమా. భారీ వసూళ్లు రాబట్టి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ పూజా హెగ్డే అందాలు అన్నీ ఈ సినిమాకు బాగా కలిసి వచ్చాయి అని చెప్పాలి.

 


 అయితే ఈ సినిమాలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సన్నివేశం అల్లు అర్జున్ డాన్స్. అదేంటి అల్లు అర్జున్ కొత్తగా ఏమీ డాన్స్ చేయడం లేదు కదా అందులో కొత్తేమీ ఉంది అంటారా. అల్లుఅర్జున్ ఇప్పటివరకు చాలానే డాన్సులు వేశాడు కానీ... వివిధ హీరో లకు సంబంధించిన పాటలపై మాత్రం ఇప్పటివరకు డాన్సులు వేయలేదు. కానీ అలా వైకుంఠపురములో  సినిమా తో ఏకంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన మెగాస్టార్ పవర్ స్టార్ కి సంబంధించిన పాటలపై ఒకేసారి డాన్స్ చేశాడు అల్లు అర్జున్. చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ కు  సంబంధించిన పాటపై డాన్స్  చేయడం... మెగాస్టార్ చిరంజీవి చిరంజీవికి సంబంధించిన పాట పై కూడా డాన్స్ చేయటం తో తెలుగు ప్రేక్షకులు మురిసిపోయారు. 

 


 ఇక ఈ సన్నివేశం తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది అనే చెప్పాలి.  మెగా ఫ్యామిలీకి మూలస్తంభాలైన ఇద్దరు  హీరోలకు సంబంధించి పాటలు కి డాన్స్ చేయడం... నిజంగా తెలుగు ప్రేక్షకులు ఊహించనిది. అందుకే ఈ సన్నివేశం తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ గా మారిపోయింది. ఇక ఈ సన్నివేశం ఎప్పుడు వచ్చినా కూడా తెలుగు ప్రేక్షకులు కళ్ళార్పకుండా చూసేలా ప్రేక్షకులను ప్రభావితం చేసింది ఈ సన్నివేశం. ఇక మెగా అభిమానులకు అయితే ఈ సన్నివేశం ఒక పండగ లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏదేమైనా అల వైకుంఠపురములో సినిమాలోని ఈ సన్నివేశం మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఆల్టైమ్ ఫేవరెట్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: