కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ఎఫెక్ట్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ లు సినిమా థియేటర్లు క్లోజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. దాదాపు రెండు నెలలకు పైగా సినిమా షూటింగులు ఆగిపోవటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. పైగా వేసవికాలంలో ఈ మహమ్మారి రావటంతో విడుదల కావాల్సిన సినిమాలు ఆగిపోవటంతో నిర్మాతలు తీవ్రస్థాయిలోనే నష్టపోయారు. అయితే ఇటీవల కేంద్రం లాక్ డౌన్ సడలింపు విషయంలో కొంచెం లూజ్ గా ప్రజలను వదలటం తో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ప్రభుత్వాలను సినిమా షూటింగ్ల కోసం పర్మిషన్ అడగడం జరిగింది. కాగా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగ్లకు అనుమతులు ఇవ్వడం జరిగింది.

IHG

ఇటువంటి సమయంలో ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన అప్పుడే నో అంటున్నారు నిర్మాతలు. ప్రభుత్వ నిబంధనలు ఆంక్షలు చూసి ఈ విధంగా అయితే సినిమా షూటింగులు జరుపుకోవడం కష్టమే అని అంటున్నారు. ప్రభుత్వం నియమించిన నిబంధనలు చూస్తే షూటింగ్ స్పాట్ లో ఒక డాక్టర్, శానిటైజర్ లు, గ్లౌజులు, హ్యాండ్ వాష్ లు, మాస్క్ లు  ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా షూటింగ్ స్పాట్ లో 45 మందికి మించి ఉండకూడదని ఈ కండిషన్ పెట్టింది.

IHG

దీంతో ఈ కండిషన్ లో నిబంధనలు చూసిన ఇండస్ట్రీ నిర్మాతలు, ఈ నిబంధనలే మాకు చాలా భారంగా ఉన్నాయని కనీసం షూటింగ్ స్పాట్ లో 100 నుండి 120 మంది లేనిదే సినిమా షూటింగ్ జరగదని నిర్మాతలు అంటున్నారు. దీంతో ఇప్పుడు అప్పుడే సినిమా షూటింగులు మొదలు పెట్టకూడదని టాలీవుడ్ నిర్మాతలు డిసైడ్ అయినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: