కరోనా రావడంతో అతలాకుతలం అయిపోతున్న ఫిలిం ఇండస్ట్రీని రక్షించడానికి అనేకమంది అనేక ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో నిన్న జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశంలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయానికి ఎంతవరకు టాప్ హీరోలు అంగీకరిస్తారు అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


నిన్న జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న అనేకమంది ప్రముఖ నిర్మాతలు సినిమాల బిజినెస్ సుమారు 30 శాతం నుండి 40 శాతం వరకు తగ్గిపోతుందని నిర్మాతలు అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీకి సంబంధించిన 24 విభాగాలకు చెందిన అన్ని వర్గాలవారు తమతమ పారితోషికాలను 25 శాతం వరకు తగ్గించుకుని సహకరించకపోతే సినిమాలు తీయలేము అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఇలా 25 శాతం పారితోషికం తగ్గించుకునే విభాగాల లిస్టులో హీరోలు హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు దర్శకులు సినిమాటోగ్రాఫర్స్ దగ్గర నుండి సంగీత దర్శకులు సింగర్లతో పాటు డబ్బింగ్ ఆర్టిస్టులు ఎడిటర్లు ఇలా అందరు సహకరించవలసిందే అన్న అభిప్రాయాన్ని అనేకమంది ప్రముఖ నిర్మాతలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇదివరకులా సినిమాల కలక్షన్స్ అంత భారీ రేంజ్ లో ఉండే పరిస్థితులు కనీసం ఒక సంవత్సరం పాటు ఉండవని ఇలాంటి పరిస్థితులలో నిర్మాతలకు అందరు సహకరించ వలసిందే అన్న పిలుపు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇచ్చింది.


ఇప్పుడు ఈ పిలుపుకు టాప్ యంగ్ హీరోలు మిడిల్ రేంజ్ హీరోలు ఎలా స్పందిస్తారు అన్న విషయమై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం అత్యంత భారీ పారితోషికం అలవాటుపడిన హీరోలు ఇప్పుడు మారిన పరిస్థితులలో ఎంతవరకు నిర్మాతలకు సహకరిస్తారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్త అవుతున్నాయి. మరికొందరు అయితే టాప్ హీరోలు ఈ విషయమై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమ పారితోషికాలను తగ్గించుకోకుండా తమ సన్నిహితులను నిర్మాతలుగా మార్చి తమ డేట్స్ అన్నీ వారికే ఇచ్చి లాభాలలో వాటాలు తీసుకుంటూ తమ పారితోషికాలు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇప్పటికే ఎవరికీ వారు టాప్ హీరోలు తమ యాక్షన్ ప్లాన్స్ ను అమలు చేయడానికి రెడీగా ఉన్నట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: