యాక్టర్ సత్యదేవ్ ఇప్పుడిప్పుడే హీరోగా అవకాశాలు తెచ్చుకుంటున్నాడు. మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన సత్యదేవ్, చిన్న చితకా పాత్రల్లో కనిపించి మెల్లమెల్లగా ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరిసాడు. అయితే పూరి జగన్నాథ్ తెరకెక్కించిన జ్యోతిలక్ష్మీ సినిమాలో హీరోగా అవకాశం రావడంలో కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తున్నాయి. యాక్టర్ గా చిన్న చిన్న పాత్రల్లో మెప్పిస్తూనే హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.

 

అత్యదేవ్ హీరోగా నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమా అంతగా ఆడలేదు. అయితే అటు వెబ్ సిరీస్లలోనూ, ఇటు సినిమాల్లోనూ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం సత్యదేవ్ నటించిన రెండు సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. కరోనా కారణంగా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకోనందున డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుందని వార్తలు వచ్చాయి. 

 

సినిమా మళయాల చిత్రమైన మహేషింటే ప్రతీకారమ్ అనే సినిమాకి తెలుగు రీమేక్. ఒరిజినల్ సినిమాలో ఫాహద్ ఫాజల్ వేసిన పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే అలాగే గత ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న  47 డేస్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందట.  పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దబ్బార శశి భూషణ్, రఘుు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. 

 

ఈ సినిమాకి రఘు కుంచె నిర్మాతగానే కాకుండా సంగీతాన్ని కూడా అందించాడు. ఈ చిత్రం మరికొద్ది రోజులో జీ5 ద్వారా స్ట్రీమింగ్ అవనుందట. ఈ విధంగా ఒకే హీరో రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వడం కొంచెం ఇబ్బందికర విషయమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ తప్ప మరో ఆప్షన్ లేదు.. సో మూవ్ ఆన్ కావాల్సిందే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: