సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అనేక కథనాలు వెలువడుతున్నాయి. సినిమా కథ గురించి మొదలు పెడితే, సినిమాలో నటించే హీరోయిన్, విలన్ పాత్రలపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నింటిపై చిత్రబృందం ఇంతవరకు స్పందించింది లేదు. తాజాగా ఈ సినిమా నుండి మరో వార్త బయటకి వచ్చింది. 

 

సర్కారు వారి పాటని డైరెక్ట్ చేస్తున్న పరశురామ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. అలా మారడానికి కూడా ఒక రీజన్ ఉందని చూపిస్తున్నారు. అదేంటంటే, పరశురామ్ తన కెరీర్లో రవితేజ మినహా మరే స్టార్ తో వర్క్ చేయలేదు. మొదటి సినిమా యువత హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ తో, ఆ తర్వాత నారా రోహిత్, అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ ఇలా అందరూ చిన్న హీరోలతోనే చేసాడు.

IHG

మరి చిన్న హీరోలతో చేసిన దర్శకుడికి ఒక్కసారిగా మహేష్ బాబుతో సినిమా అవకాశం రావడం గొప్ప విషయమే. అయితే గీత గోవిందం బ్లాక్ బస్టర్ అవడం కూడా ఒక కారణమే. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా పరశురామ్ గీతని మార్చివేసింది. దాంతో మహేష్ బాబు దొరికాడు. అయితే మహేష్ సర్కారు వారి పాటకి పరశురామ్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనే విషయానికి వస్తే, ముందుగా 10 కోట్లు ఇవ్వాలని అనుకున్నారట.

 

కానీ కరోనా వల్ల చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాల్లోకి వెళ్ళి పోవడంతో ప్రతో ఒక్కరూ తమ తమ పారితోషికాలని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో పరశురామ్ పారితోషికం మూడు కోట్లు తగ్గి 7 కోట్లుగా అయ్యిందట. అదీగాక సినిమా ప్రాఫిట్ లో షేర్ కూడా ఉంటుందట. ఏది ఏమైనా సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: