పౌరాణిక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ సీనియర్‌ ఎన్టీఆర్. తెలుగు వాడి కీర్తిని దశదిశలకు చాటిన మహానటుడు ఎన్టీఆర్. వ్యక్తిగా ఆయన మాత్రమే కాదు, ఆయన సినిమాలు కూడా చరిత్రలో అదే స్థాయిలో నిలిచిపోయాయి. అలా ఎన్టీఆర్ పోషించిన పాత్రల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా దాన వీర శూర కర్ణ. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలో కనిపించాడు.

 

ముఖ్యంగా కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్‌ని తప్ప మరో వ్యక్తిని ఊహించుకోలేని స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఇక దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన దుర్యోధనుడి పాత్ర విలనిజంలోనూ హీరోయిజాన్ని చూపించింది. ఈ పాత్రలో ఎన్టీఆర్ చెప్పిన ఏమంటివి ఏమంటివీ డైలాగ్‌ చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ డైలాగ్‌ మొబైల్‌ రింగ్‌టోన్‌లుగా, డైలర్‌ టోన్లుగా వినిపిస్తుందటంనే ఆ డైలాగ్‌ గొప్పదనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

 

ఇంతలా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ఆ డైలాగ్‌.. `ఆచార్యదేవా! యేమంటివి యేమంటివి
జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా....ఎంతమాట ఎంత మాట
ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదా? కాదు కాకూడదు...
ఇది కుల పరీక్షయే అందువా....నీ తండ్రి భరధ్వాజుని జననమెట్టిది?
అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా నీది యే కులము...
ఇంత యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రల భార్యయగు
గంగా గర్భమున జనియించలేదా... ఈయనది యే కులము?
నాతో చెప్పిస్తివేమయ్యామా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా...?
ఆతడు పంచమజాతి కన్యయైన అరుంధతియందు శక్తినీ ఆ శక్తి ఛండలాంగనయందు పరాశరునీ
ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధియందు మా తాత వ్యాసునీ
ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రినీ
పినపితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజునూ
మాయింటి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా.....
సందర్భావసరములనుబట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కుల హీనమైనది.
కాగా నేడు కులము కులము అని వ్యర్థ వాదమెందులకు?`
ఈ ఒక్క డైలాగ్‌ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: