కొన్ని సనివేశాలు సినిమా మేకింగ్‌ కు కొత్త సవాళ్ల ను సృష్టిస్తాయి. స్టార్ హీరో లతో భారీ యాక్షన్ సీన్ తెరకెక్కించటం అన్నది చాలా కామన్‌. కానీ ఓ చిన్నారి తో సినిమా మొత్తానికి హైలెట్‌ గా నిలిచే సినిమా తీయటం అంటే. అది కూడ ఓ సూపర్ స్టార్ నటించిన ఈ సినిమా లో ఆ హీరో కు బదులుగా ఓ బుడతడి మీద ఓ భారీ యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తే ఎవరైనా అవాక్కావాల్సిందే.

 

అలా యావత్‌ దేశాన్ని అవాక్కయ్యేలా చేసిన యాక్షన్‌ సీన్‌ మన్యం పులి సినిమా లోనిది. ఈ సినిమా స్టార్టింగ్‌ ఓ భారీ యాక్షన్ సీన్‌ తో ప్రారంభించాడు దర్శకుడు. అడివి లో తన తండ్రిని చంపిన ఓ పెద్ద పులి ని ముక్కుపచ్చలారని ఓ పసి బాలుడు వేటాడే సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. పులి దారిని అడ్డగించిన తన దారి లోకి తెచ్చుకోవటం, వెంటపడుతున్న పులిని ఉచ్చు లోకి తీసుకురావటం. బాణాల తోనూ, చెక్కమొద్దుల తోనూ దాన్ని గాయపరచటం ఇలా ప్రతీ చిన్న విషయాన్ని అద్భుతంగా చూపించాడు.

 

చివరకు ఆ చిన్నారే బల్లెం తో పులిని చంపే సమయానికి ఎవరికైనా గూజ్‌బంప్స్‌ రావటం కాయం. అందుకే ఇలాంటి అద్భుతమైన యాక్షన్‌ ను తెరకెక్కిచాడు కాబట్టి యాక్షన్‌ కొరియోగ్రఫి కేటగిరిలో తొలి జాతీయ అవార్డు ను అందుకున్నాడు పీటర్‌ హెయిన్స్. మలయాళ సూపర్‌ స్టార్ మోహన్‌ లాల్ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా మన్యంపులి. వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను 25 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. మలయాళంలో పులి మురుగన్ పేరుతో రూపొందిన ఈ సినిమాను తెలుగులో మన్యం పులితో రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: