బాలీవుడ్‌ యంగ్ హీరో టైగర్‌ ష్రాఫ్‌, లోఫర్ బ్యూటీ దిశా పటానీల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. భాగీ 2 సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన ఈ జంట తరువాత తరచూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. సినిమా ఫంక్షన్లతో పాటు పలు ప్రైవేట్‌ పార్టీస్‌లోనూ టైగర్‌, దిశాలు కలిసి కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న టాక్‌ బలంగా వినింపించింది.

 

అయితే తామిద్దరం ప్రేమలో ఉన్నట్టుగా దిశా, టైగర్‌లు క్లారిటీ ఇవ్వకపోయినా మీడియాలో వస్తున్న వార్తలను మాత్రం ఎప్పుడూ ఖండించలేదు. దీంతో నిజంగానే టైగర్‌, దిశాల మధ్య సంథింగ్ సంథింగ్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అదే సమయం లో లాక్‌ డౌన్‌ రావటంతో క్వారెంటైన్‌లోనూ ఈ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ విషయంలో కూడా టైగర్‌ దిశాలు స్పందించలేదు.

 

తాజాగా ఈ రోజు దిశా పటాని పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు, వీడియోతో పాటు పుట్టిన రోజు శుభాకాంక్షలు రాక్‌ స్టార్‌ అంటూ పోస్ట్ చేశాడు. వెంటనే స్పందించిన దిశా థ్యాంక్యూ సూపర్‌ స్టార్ అంటూ కామెంట్ చేసింది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ తెర మీదకు వచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

3 waffles and 3 pancakes later 😂...happy birthday rockstar❤️ @dishapatani

A post shared by tiger Shroff (@tigerjackieshroff) on

మరింత సమాచారం తెలుసుకోండి: