తాతగారు ఎన్టీఆర్ పేరుని పెట్టుకున్న తారక్ స్టార్ హీరోగా ఎదిగి ఆయన వారసత్వాన్ని అలాగే నిలబెడుతూ వస్తున్నాడు. తనకు నచ్చిన పాత్ర వస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఆ రోల్ అంతం చూడటంలో తాతలాగే మొండిఘటం. అంతే కాదు బాబాయ్ బాలకృష్ణలా డైలాగ్స్ కూడా ఒకరేంజ్ లో చెప్పి.. తొడకట్టగలనని ప్రూవ్  చేసుకున్నాడు.

 

 

రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వలో వచ్చిన స్టూడెంట్ నంబర్ వన్ సూపర్ హిట్ సాధించింది. హీరోగా ఎన్టీఆర్ ఈ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తదుపరి మూడవ చిత్రంగా సుబ్బు విడుదల కాగా అది మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ భారీ స్టార్ డమ్ తెచ్చిన చిత్రం ఆది. ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆది అతనికి విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ కి మొదటి బ్లాక్ బస్టర్ వచ్చే నాటికి కేవలం వయసు 19 ఏళ్లే. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా, ఈ సీమలో మొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత, వంటి డైలాగ్స్ జనాల్లో చానళ్ళు నలిగాయి.

 

 

యమదొంగ సినిమాలో తారక్ చెప్పిన ‘మానవ జాతి అంత నీచమా’ అంటూ జూనియర్ పలికిన లెంగ్తీ డైలాగ్స్ ప్రేక్షకుల చేత ఈలలు వేసేలా చేశాయి. అదుర్స్ లో ఎన్టీఆర్ కామెడీ పండించి తాను హాస్యపాత్రలు సైతం బాగా చేయగలనని నిరూపించుకున్నాడు.

 

 

సినిమా తరువాత ఎన్టీఆర్ .. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ’ సినిమా వరకు వరుసగా ఐదు సక్సెస్‌లను అందుకున్నాడు. ఇందులో జై లవకుశలో మూడు విభిన్న పాత్రల్లో అది కూడా ఒకే డ్రెస్ వేసుకొని కేవలంతోనే నటనను పండించి ఔరా అనిపించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: