టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆ సినిమాల్లో ఉండే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటాయి అనేది వాస్తవం. సినిమా ఏ విధంగా ఉన్నా సరే కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. బాలకృష్ణ సినిమాల్లో చాలా సినిమాలు ఫ్లాప్ అయినా సరే వాటిల్లో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు చాలా వరకు హిట్ అవుతాయి అనేది వాస్తవం. ఇక ఇది పక్కన పెడితే ఆయన సినిమాల్లో భారీ అంచనాతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమా చెన్నకేశవ రెడ్డి. 

 

ఆ సినిమాలో ఉండే చాలా సన్నివేశాలు ప్రేక్షకులను చాలా వరకు ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఆ సినిమాలో బాలకృష్ణ చేసిన ఫైట్ లు కత్తి వాడిన విధానం అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా మెప్పించింది. ఆ సినిమాలో బాలకృష్ణ ఒక సందర్భంగా పలికిన ఒక డైలాగ్ కి అయితే టాలీవుడ్ లో జనాలు షేక్ అయ్యారు. ఇక సత్తిరెడ్డి అనగానే కార్లు లేచే సీన్ అయితే సినిమాకే కాదు టాలీవుడ్ కి కూడా హైలెట్ అని అంటారు జనాలు.  ఆ సీన్ లో టబు నటన ఒక హైలెట్ అయితే ఆ తర్వాతః కార్లు లేవడం  ఖర్చు కాదు రా ఖలేజా ఉండాలి అని బాలయ్య డైలాగ్ చెప్పడం అన్నీ కూడా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. 

 

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల విషయంలో కాస్త ఆలోచించి చేసారు అనేది వాస్తవం. ప్రతీ సీన్ కూడా ఆ సినిమాలో బాగున్నా సరే క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకోలేదు అని సినిమా ఫ్లాప్ అయింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత బాలయ్య రేంజ్ బాగా పెరిగింది అని అంటారు టాలీవుడ్ లో జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: