ఓ మారుమూల గ్రామంలో నివసిస్తున్న భద్రాచలం అనే పేరు గల వ్యక్తి అంతర్జాతీయ టైక్వాండో ఛాంపియన్ గా ఎలా ఎదుగుతాడు అన్నది భద్రాచలం సినిమాలో చూపించబడింది. 2001 డిసెంబర్ ఆరో తేదీన విడుదలైన ఈ సినిమాలో ఎక్కువగా డ్రామా అనగా ప్రేమ, అసూయ, ఈర్ష్య, భావోద్వేగం, బాధలు, కష్టాలు, నమ్మకం, నమ్మక ద్రోహం, పట్టుదల వంటి ఎన్నో అంశాలు చూపించబడ్డాయి. ఇద్దరు అన్నయ్యలకు తమ్ముడైన భద్రాచలాన్ని తన ఇద్దరు వదినలు చాలా చులకనగా చూస్తూ వాసన పట్టిన సద్దన్నం వడ్డిస్తుంటారు. 

IHG
ఒకానొక రోజు పరశురామ్( విజయ్ చందర్), మహాలక్ష్మి( సింధు మీనన్)ల పొలం విషయంలో తను తన అన్నయ్య పొలానికి నీళ్లు పెట్టే వ్యక్తితో గొడవపడగా... అతడు కక్షగట్టి వాళ్లకి నీళ్లు వదలనని చెప్తాడు. దాంతో తన వదినలు అతడిని ఇంటి నుండి గెంటివేయగా తాను సిటీకి వెళ్లి మహాలక్ష్మి తండ్రి పరశురాంకి శిష్యుడు కావాలనుకుంటాడు. తదనంతరం పరశురాం భద్రాచలానికి టైక్వాండో విద్యను నేర్పించి పోటీలలో పాల్గొనేలా చేస్తాడు. అయితే భద్రాచలం టైక్వాండో కళను నేర్చుకునే సమయంలో రోమాలు నిక్క పొడిచే సన్నివేశాలతో పాటు మహాలక్ష్మి అతడిపై చూపించే ప్రేమ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. లత అనే అమ్మాయి పాత్రలో నటించిన రూపా కూడా గర్వం, అసూయతో కూడిన అమ్మాయిలాగా ఒదిగిపోయి వావ్ అనిపించింది. 


పరశురాం వద్ద ట్రైనింగ్ నేర్చుకోని అందరి ముందు అతడి చొక్కా చింపి మరీ కొట్టిన సూరజ్ పై భద్రాచలం పోరాడి గెలిచే సన్నివేశం అందరి సినీ ప్రేక్షకులలో ఒక సంతృప్తిని పొందుపరుస్తుంది. చివరిలో అంతర్జాతీయ పోటీలో ఓ విదేశీయుడు పై భద్రాచలం గెలిచే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఏదేమైనా పోసాని కృష్ణమురళి ఈ సినిమాకి డైలాగులను చాలా చక్కగా రాసారు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: