పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా 1999వ సంవత్సరంలో విడుదలై సంచలనం సృష్టించింది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సోదరుడిగా అచ్యుత్, ప్రియురాలిగా ప్రీతి జింగానియా, లవ్లీ గా అదితి గోవిత్రికర్ నటించారు. సోదరుడు చక్రి(అచ్యుత్) తమ హోటల్ లో పనులు చేస్తూ మరోవైపు పట్టుదలతో బాక్సింగ్ కోచింగ్ తీసుకుంటూ పోటీలలో పాల్గొంటాడు. తన తండ్రి అతనికి పూర్తి మద్దతు ఇస్తూ ఉంటాడు కానీ చిన్న కుమారుడు సుభాష్(పవన్ కళ్యాణ్) మాత్రం సరిగ్గా చదువుకోకుండా ఇంటి పనులు చేయకుండా అమ్మాయిల వెంటతిరుగుతుండడంతో అతడిని బాగా తిడుతుంటాడు. తన పాకెట్ మనీ కోసం తండ్రి స్నేహితుడు(చంద్రమోహన్) కూతురు అయిన జానకి వద్ద అప్పు చేస్తుంటాడు. 


జానకి కి సుభాష్ అంటే చచ్చేంత ప్రేమ కానీ అతడు మాత్రం అది గ్రహించకుండా ధనిక కాలేజీ అమ్మాయిల వెంటపడుతుంటాడు. ఈ క్రమంలోనే అతనికి లవ్లీ అనే ఒక అమ్మాయి పరిచయమవుతుంది కానీ సుభాష్ పేదింటి కుర్రాడు అని తెలిసి వదిలేస్తుంది. ఈ విషయాలన్నీ తన తండ్రి దృష్టికి రావడంతో సుభాష్ ని ఇంటి నుండి బయటకు గెంటి వేస్తాడు. దాంతో జానకి సుభాష్ కి తిండి, కూడు, గుడ్డ సమకూర్చడంతో పాటు బాధ్యత గల వ్యక్తిగా మారమని హితబోధ చేస్తుంది. ఈ క్రమంలోనే చక్రి పై ప్రత్యర్థి బాక్సింగ్ చక్రి పై దాడి చేస్తుంది. దాంతో చక్రి రెండు కాళ్ళు విరిగి పోగా మూడు నెలల రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. తాను ఇంతకాలం కఠోర శ్రమతో బాక్సింగ్ మ్యాచ్ కి సిద్ధమవ్వగా ఈ సంఘటన వలన అదంతా వృధా అవుతుంది.

 

దాంతో తన నాన్న కూడా తీవ్ర మనస్థాపానికి గురవుతాడు. ఇది తెలుసుకున్న సుభాష్ అన్నయ్య స్థానంలో బాక్సింగ్ మ్యాచ్ లో ఆడదామని నిర్ణయించుకొని చక్రికి బాక్సింగ్ నేర్పించిన గురువు వద్దకు వెళ్లి తన ఆసక్తి చూపుతాడు. అతడి పట్టుదల చూసి గురువు కూడా సుభాష్ కి బాక్సింగ్ నేర్పిస్తాడు. ఐతే సుభాష్ బాక్సింగ్ నేర్చుకునే విధానం రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయని చెప్పవచ్చు. అలాగే ఫైనల్ కిక్ బాక్సింగ్ మ్యాచ్ లో తన ప్రత్యర్థిపై గెలవడం, జానకి కి ఐ లవ్ యు చెప్పడం అందర్ని భావోద్వేగానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: