2017 మార్చి 31వ తేదీన విడుదలైన గురు సినిమాలో వెంకటేష్, రితికా సింగ్, ముంతాజ్ సోర్కార్, నాజర్, తనీకెల్లా భరణి, రఘు బాబు, జఖీర్ హుస్సేన్, అనితా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించగా... సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. క్రీడారంగంలోని అంతర్గత రాజకీయాల కారణంగా ఆదిత్య(వెంకటేష్) అనే సూపర్ టాలెంట్ ఉన్న బాక్సర్ ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లలేకపోతాడు. తన వల్ల కానిది తన శిష్యుల వల్లేనా అవ్వాలనే ఉద్దేశంతో ఆది బాక్సింగ్ కౌచ్ గా అవతారమెత్తుతాడు. ఈ క్రమంలోనే అతనికి కూరగాయలు అమ్ముకుని బతికే పేదింటి అమ్మాయి రామేశ్వరి(రితికా సింగ్) తారసపడుతుంది. ఆమెలో ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంటు ఉందని గ్రహించిన ఆదిత్య ఆమెకు డబ్బులిచ్చి మరీ బాక్సింగ్ నేర్పిస్తాడు. 


మొదటిలో ఆమె ఆదిత్యకు అంతగా సహకరించకపోయినా చివర్లో మాత్రం ఆదిత్య చెప్పినట్టు నడుస్తూ సీరియస్ గా బాక్సింగ్ చేస్తుంటుంది. తన శిష్యురాలైన రామేశ్వరి కి వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలని ఆదిత్య కోరగా... ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ హెడ్ దేవ్ ఖత్రీ( జాకీర్ హుస్సేన్) మాట్లాడుతూ... నీ బాక్సింగ్ పదవులకు రాజీనామా చేసి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతేనే రామేశ్వరిని పోటీలలో ఆడనిస్తామని చెప్తాడు. దాంతో ఆదిత్య తన బాక్సింగ్ కెరీర్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా రాజీనామా చేస్తాడు. అప్పుడు రామేశ్వరి కి ఎంట్రీ దొరుకుతుంది కానీ తన గురువైన ఆదిత్య చుట్టుపక్కల ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె బాగా మనస్థాపానికి గురవుతుంది. ఫలితంగా ప్రత్యర్థి అయిన రష్యన్ బాక్సర్ తో సరిగ్గా ఆడ లేక పోతుంది. 


చివరి రౌండ్ జరుగుతున్న సమయంలో ఆదిత్య సెక్యూరిటీ గార్డులను కూడా లెక్క చేయకుండా మ్యాచ్ చూసేందుకు వచ్చి ఓడిపోతున్న రామేశ్వరి కి కనిపించి... ఆమెకు ఒక టెక్నిక్ చెబుతాడు. అతడిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు రామేశ్వరి లో శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఆదిత్య చెప్పిన టెక్నిక్ ని గుర్తుకు తెచ్చుకొని ప్రత్యర్థి మోచేతులపై బలమైన పంచెస్ విసురుతుంది. ఫలితంగా ఆ రష్యన్ బాక్సర్ చేతులు బలహీనం అవుతాయి. దాంతో రామేశ్వరి ఆమెను వెంటనే నాకౌట్ చేసి సంచలన విజయం సాధిస్తుంది. తన వల్లే గెలిచిందని దేవ్ ఖత్రీ చెప్పుకుంటున్న సమయంలో రామేశ్వరి అతని వద్దకు వచ్చి గట్టిగా గుద్ది... ఆదిత్య వైపు వేగంగా పరిగెడుతూ అతని పైకి ఎక్కి గట్టిగా హత్తుకుంటుంది. అయితే ఒక గురువు శిష్యురాలు మధ్య చోటుచేసుకునే ఈ సన్నివేశం ప్రేక్షకులకు ఒక మధురాతి అనుభూతిని కల్పించిందని చెప్పుకోవచ్చు. ఈ సన్నివేశం చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఖచ్చితంగా భావోద్వేగానికి గురి అయ్యే ఉంటాడు

మరింత సమాచారం తెలుసుకోండి: