టాలీవుడ్  ఇండస్ట్రీలో యూత్ ఐకాన్ అంటే వినపడే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన సినిమాలలో ఉన్న మెసేజ్ ,పంచు డైలాగులు తెలుగు సినీ అభిమానులను ఆకట్టుకుంటాయి అని వేరేలా చెప్పనక్కర్లేదు..సినిమాలలో పవన్ కళ్యాణ్ స్టయిల్, మ్యానరిజం అందరికీ నచ్చుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెగాస్టార్ తమ్ముడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా సొంత ఇమేజ్ ను క్రియేట్ చేస్తూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..

 

 


వరుస సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ వరుస హిట్ సినిమాలతో ఒక్కసారిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అబ్బాయిలను మాత్రమే కాదు అమ్మాయిలను కూడా ఆకట్టుకుంది..అమ్మాయిల కలల రాకుమారుడు పవన్ కళ్యాణ్ అయ్యారంటే నమ్మండి.. పవన్ కళ్యాణ్  కు  సినిమాలలోనే కాదు బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. జనసేన పార్టీనీ స్థాపించి జనాల కష్టాలను తెలుసుకున్నాడు.అందుకే పవన్ అంటే యువతకు ఎనలేని అభిమానం..

 

 

 

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. పవన్ యూత్ ను ఆకట్టుకునే విధంగా సినిమాలను చేస్తూ వస్తున్నారు..దాంతో పవన్ కళ్యాణ్ దేవుడయ్యాడు..ఇకపోతే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే పంచులతో పొట్ట చెక్కలవ్వాల్సిందే..త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అత్తారింటికి దారేది.. ఈ సినిమా కథ అందరికి నచ్చడంతో పాటుగా పంచులు బాగా పేలడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రావాలని పవన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం దిల్ రాజ్ నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు.. హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పింక్ సినిమా రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది..ఈ సినిమా పవన్ కు ఏ మాత్రం హిట్ ని అందిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: