నందమూరి నట సింహం బాలకృష్ణ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో యాక్షన్ సినిమాను ప్రేక్షకులకు అందించారు. మాస్ యాక్షన్ సినిమాలు తీయాలంటే అది కేవలం బాలయ్యతో మాత్రమే సాధ్యం అన్న విధంగా పాపులర్ అయ్యారు.. ఎన్నో యాక్షన్ సినిమాలలో నటించి మెప్పించారు.. మాస్ సినిమాలకు కేరాఫ్ గా ఉన్న బాలయ్య యువతను ఆకట్టుకుంటూ వస్తున్నాడు..అంతే కాకుండా యాక్షన్ సినిమాలను ఎంతగా చేస్తూ వచ్చాడో అంతకు మించి రొమాంటిక్ సినిమాలలో కూడా నటించాడు.  

 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య సినిమాలకు చాలా ప్రత్యేకత ఉంది.. సినిమాలతో రాయలసీమ ఫ్యాక్షన్ ను పరిచయం చేసిన ఘనత ఒక్క బాలయ్యకు దక్కింది..  అందుకే ఇప్పుడు ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.. అయితే ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు బాలయ్య. మాస్ జోనర్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ అగ్ర హీరో గా మంచి మార్కెట్ ను  ఏర్పాటు చేసుకున్నారు...

 

 

 

ఆయన సినిమాల విషయానికొస్తే ఎన్నో మాస్ యాక్షన్ సినిమాలను ప్రేక్షకుల అందించి సరికొత్త రికార్డును సృష్టించాడు.. ఇకపోతే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో హార్ట్ ను టచ్ చేసిన సినిమా అంటే అది లెజెండ్ అని చెప్పాలి.. పేద ప్రజల అవసరాల ను తీర్చడం కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సే తన ఊపిరి అనుకున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఎంత ఉందొ అంతకు మించి హార్ట్ టచింగ్ డైలాగులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఆడవాళ్లను పొగుడుతూ వచ్చిన డైలాగు వింటే ఎటువంటి రాతి గుండె  ఉన్న మనిషైనా సరే కన్నీళ్లు పెట్టాల్సిందే. ఆ డైలాగు సినిమాకు హైలెట్ అయ్యింది.ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా లో నటిస్తున్నాడు.. సరికొత్త కథతో ఆ సినిమా రూపొందుతుంది..త్వరలోనే చిత్రీకరణ పూర్తిచేసుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: