డ్యాన్స్ అంటే ఒక అద్భుతం.. ఎన్నో హావభావాలు పలికించే సత్తా డ్యాన్స్ లో ఉంది.  భారత దేశంలో ఎన్నోరకాల నృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం.  ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి.  అయితే భారత దేశంలో పాశ్చాత్య నృత్యాలకు పాపులారిటీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా రియాల్టీ షోలు వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగు లోకి వచ్చారు.. ప్రస్తుతం మంచి కొరియోగ్రాఫర్లుగా పని చేస్తున్నారు.  బాలీవుడ్ లో తనదైన డ్యాన్స్ తో అందరినీ ఆకర్షించిన హీరో హృతిక్ రోషన్.  తన శరీరాన్ని దూది పింజలా తిప్పగల నటుడు హృతిక్ రోషన్.  యాక్షన్ హీరోగానే కాదు.. మంచి డ్యాన్సర్ గా ప్రేక్షకుల దృష్టి ఆకర్షించారు.

IHG

ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని నృత్యం నేర్చుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు.  బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కూడా ఇదే కోవకు చెందిన అభిమానే. అలాంటి హృతిక్‌ను ఓ చిన్నారి ఫిదా చేసింది. స్టెప్పులు ఇరగదీసి.. వహ్వా‌ అనిపించుకుంది. ఆయన నటించిన 'వార్' చిత్రంలోని 'జై బోలో శివ్‌శంక‌ర్‌' పాట‌కు గీత్ అనే బాలిక డాన్స్ చేసింది.

 

ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన హృతిక్ రోషన్‌ దాన్ని రీట్వీట్ చేస్తూ ఆమెను ప్రశంసించాడు. ‘వాట్‌ ఎ స్టార్‌.. లవ్‌యు’ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం గీత్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి ఏ మాత్రం తడబడకుండా అవలీలగా డ్యాన్స్‌‌ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. దాదాపు 1.26 లక్షల మందికిపైగా వీడియోను వీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: