పాత సినిమాలో అయిన... కొత్త సినిమాలో అయిన... హిట్ సినిమాలు అయిన ఫ్లాప్ సినిమా అయిన... చిన్న హీరో సినిమా అయిన పెద్ద హీరో సినిమా అయిన... ఇలా ఎవరి సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఆ సినిమాలో ఏదైనా సన్నివేశం నచ్చింది అంటే ఆ సన్నివేశాన్ని ఎక్కువసార్లు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఇలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సన్నివేశాలు చాలా తక్కువగానే ఉంటాయి అని చెప్పారు. అయితే రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమా లోని ఓ సన్నివేశం మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి కూడా బాగానే ఉంది. ఈ సినిమా వచ్చి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఆ సన్నివేశం వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 

 

 దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాలో రవితేజ హీరోగా నటించగా... అనుష్క హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రవితేజకు ఒక బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. రవితేజ లోని సరికొత్త యాంగిల్ ని ప్రేక్షకులకు చూపించడంతో పాటు రవితేజ కెరీర్ లో కీలక మలుపు తిప్పింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. ఒకటి  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ రాథోడ్ పాత్రలో నటించగా.. మరొకటి జోబు  దొంగ అయిన అత్తిలి సత్తిబాబు అనే పాత్రలో నటిస్తాడు. అయితే అత్తిలి సత్తిబాబు కామెడీ పరంగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తే.. విక్రమ్ రాథోడ్ పాత్ర తెలుగు ప్రేక్షకులందరికీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. 

 

 ముఖ్యంగా ఈ సినిమాలో ఓ సన్నివేశం మాత్రం ప్రేక్షకులకు మదిలో నిలిచిపోయింది. విక్రమ్ రాథోడ్  పాత్ర లో ఉన్న రవితేజ తన పై ఆఫీసర్ అయిన ప్రకాష్ రాజ్ ను కలిసేందుకు వచ్చినప్పుడు నీకు భయంలేదా అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించగా... నాకు భయం లేదు అని ఎందుకనుకుంటున్నారు సర్.. ప్రతిరోజు ప్రతిక్షణం భయపడుతూనే బతుకుతున్నాను  అంటూ రవి తేజ పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతూ ఉంటే సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ సన్నీ వేషం తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: