తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇందులో ప్రేక్షకుల ఆదరణ పొంది హిట్ అయిన సినిమాలు కొన్నైతే ప్రేక్షకుల ఆదరణ పొందలేక తెరమీద కనిపించకుండా పోయిన సినిమా లు  మరికొన్ని. ఇలా చాలానే ఇలా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు వస్తుంటాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండి పోతుఉంటాయి. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక ఇలా కనెక్ట్ అయిన సన్నివేశాలను ఎన్ని సార్లు చూసిన ప్రేక్షకులు అలాంటి కిక్కే  పొందుతూ ఉంటారు. అయితే హీరో వెంకటేష్ సినిమాల విషయానికొస్తే ఎన్నో సినిమాల్లో చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి మదిలో నిలిచిపోయిన సన్నివేశాలు ఉన్న విషయం తెలిసిందే. 

 


 ఇక ఈ మధ్య కాలంలో వెంకటేష్ నటించిన సినిమాల్లో  ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన సన్నివేశాలలో ఒకటి వెంకీ ఆసన్ . ఎఫ్ 2 సినిమా లో వెంకటేష్ వరుణ్తేజ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరికీ జోడీగా తమన్నా మెహరీన్ లు నటించారు. ఈ సినిమాలో వెంకటేష్ భార్య బాధితుడు గా నటించాడు. మామూలుగానే ఫ్యామిలీ ఎమోషన్స్ లో  ఎక్స్ ప్రెషన్స్ పండించడంలో వెంకటేష్ తనకుతానే సాటి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని వెంకటేష్ పాత్ర చెబుతూ ఉంటుంది. ఇక భార్య బాధితుడైన  వెంకటేష్ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి ఈ సినిమాలు వెంకీ ఆసన్ యూస్ చేస్తాడు . 

 

 ఇలా ఈ సినిమాలో వెంకటేష్ చేసే వెంకీ ఆసన్  తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయింది అని చెప్పాలి. ముఖ్యంగా అందరూ భార్య  బాధితులకి ఈ సినిమా స్టొరీ కనెక్ట్ అవ్వడం తో పాటు... వెంకటేష్ భార్యల ద్వారా వచ్చే ఫ్రస్ట్రేషన్  తగ్గించుకోవడానికి చేసే వెంకీ ఆసన్ భర్తలకు  బాగా ఫేవరేట్ గా మారిపోయింది. ఇక నిజ జీవితంలోని భర్తలు  కూడా కొంతమంది ఇలా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు  వెంకీ ఆసన్  ప్రయత్నించడం కూడా చేశారు. ఇలా వెంకటేష్ నటించిన ఎఫ్ 2 సినిమా లో... వెంకటేష్  వెంకీ ఆసన్  సన్నివేశం భర్తలు అందరికీ మదిలో నిలిచిపోయింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: