సినిమా అవకాశాలు కోసం చాలా మంది కష్టపడుతున్నారు..సినిమా ప్రపంచంలో ఒక హిట్ అయితే వరుస అవకాశాలు వస్తాయి..అలా రెండు మూడు సినిమాలు కనుక హిట్ అయితే ఇంక వారితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు హీరోయిన్లు ఇప్పుడు పలు భాషల్లో నటిస్తూ వస్తున్నారు. అయితే ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటించిన హీరోయిన్లు ఇప్పుడు కనిపించడం లేదు.. దానికి కారణం లేక పోలేదు కొత్త హీరోయిన్ల ఎంట్రీ వల్ల కొందరు సినిమాలకు దూరం అయితే..మరికొందరు పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు.. 

 

 

 
అసలు విషయానికొస్తే.. తెలుగులో కూడా బాలీవుడ్ తారలు  సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు.. వారందరూ ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.. అయితే ఏమైందో గాని మళ్లీ తెలుగు సినిమాలలో కొద్ది రోజుల నుంచి ఏ సినిమాలు చేయలేదు.. కేవలం హిందీ చిత్రాలలో మాత్రమే నటిస్తూ వస్తున్నారు..అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్లు లిస్ట్ లోకి వస్తారు..  ఆ జాబితాలో ముందుగా వినిపించే పేరు ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అందానికి అభినయానికి తెలుగు జనాలు ఎప్పుడో ఫిదా అయ్యారు..ఆమె అందమైన కళ్ళతో , అభినయంతో ఎన్నో హిట్ సినిమాలలో నటించి మెప్పించారు.. అంతేకాకుండా ఎన్నో అవార్డులను అందుకున్నారు..  

 

 

 

తెలుగులో ఐసు నటించిన జీన్స్ సినిమా బాగా పాపులర్  అయ్యింది.. ఆ సినిమాలో నటించిన ఐసు నటనకు అవార్డులు కూడా అందుకున్నారు.. అలా తెలుగు ,హిందీ , తమిళ్ సినిమాలలో వరుస హిట్ లను అందుకున్న ఈ అమ్మడు కొంతకాలం నుంచి తెలుగులో సినిమాలు చేయడం లేదు . హిందీ చిత్రాలలో మాత్రమే నటిస్తూ వస్తున్నారు.. తెలుగులో ఈమె ఇప్పటికీ సినిమాలు చేస్తే అన్నీ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతాయని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..ఇకనైనా తెలుగులో సినిమాలు చేస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: