చిరంజీవి తో సినిమా చేసిన దర్శకుడు అనగానే ఇక అతనికి ఉండే గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ఆఫర్లు వస్తూ ఉంటాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే అతనికి ఉండే గుర్తింపు ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే ఒక దర్శకుడు మాత్రం ఇప్పుడు చిరంజీవి తో సినిమా చేసి ఏ సినిమా చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారన్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. మెగాస్టార్‌తో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేసిన ద‌ర్శ‌కుడికి ఈ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆలోచిస్తే కాస్త విచిత్ర‌మే అనుకోవాలి.

 

ఆ దర్శకుడు ఎవరో కాదు సైరా సినిమా చేసిన సురేందర్ రెడ్డి. ఆ సినిమా మీద చిరంజీవి తో పాటుగా నిర్మాత రామ్ చరణ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ సినిమా మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. దీనితో అందరూ కూడా ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయారు. ఆ సినిమా టాలీవుడ్ లో ఎన్నో అంచనాలతో రావడం.. అంచ‌నాలు అందుకోలేక‌పోవ‌డంతో అంద‌రిని నిరాశ ప‌రిచింది. తెలుగులోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. ఇక మిగిలిన భాష‌ల్లో ఘోరంగా ప్లాప్ అయ్యింది.

 

సినిమా ప్లాప్ త‌ర్వాత‌ సురేందర్ రెడ్డి తో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. అగ్ర హీరోల తో ఒకప్పుడు సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి ఇప్పుడు సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. ఈ వార్త‌లు ఎలా ఉన్నా సైరా ప్లాప్ త‌ర్వాత మాత్రం ఆయ‌న‌ హడావుడి అయితే ఎక్కడా కనపడటం లేదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: