టాలీవుడ్‌ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా స్వ శక్తితో ఎంట్రీ ఇచ్చి హీరోగా సత్తా చాటుతున్న నటుడు నేచురల్ స్టార్‌ నాని. అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని, ప్రస్తుతం మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా మంచి రేంజ్‌లో ఉన్నాడు. ఇటీవల సక్సెస్‌ల విషయంలో కాస్త వెనుకపడినా వరుస సినిమానలు లైన్‌లో పెట్టి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

 

ఇటీవల గ్యాంగ్ లీడర్‌ సినిమాతో ఆకట్టుకున్న నాని ఆ తరువాత వీ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. నానిని హీరోగా వెండితెరకు పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని నెగెటివ్‌ రోల్‌లో నటిస్తున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. సుధీర్‌ బాబు, నివేదా థామస్‌, అదితి రావ్ హైదరీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గత నెలలోనే రిలీజ్‌ కావాల్సి ఉండాగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో తన నిరీక్షణను అభిమానులతో పంచుకున్నాడు నాని. వీ సినిమా తొలి రోజు షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసి `వి సినిమా తొలి రోజు షూట్‌ సందర్భంగా తీసిన ఫోటో.. మీ అందరితో కలిసి ఈ సినిమా చూసే రోజు కోసం ఎదురుచూస్తున్నా.. అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి` అంటూ కామెంట్ చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Pic from the first day shoot of #V Waiting for the day we will all watch it together .. until then .. stay safe :)

A post shared by Nani (@nameisnani) on

మరింత సమాచారం తెలుసుకోండి: