ఈరోజుల్లో సినిమా నుండి ప్రతిరోజూ పండుగే సినిమా వరకు డైరక్టర్ మారుతి సక్సెస్ రేటు చూస్తే అందరు షాక్ అవ్వక తప్పదు. ఈరోజుల్లో, బస్టాప్ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయినా కూడా అతనికి బూతు సినిమాల దర్శకుడు అన్న ట్యాగ్ లైన్ తగిలించారు. ఆ తర్వాత నానితో భలే భలే మగాడివోయ్ సినిమా తీసి దర్శకుడిగా తన ప్రతిభ చాటాడు మారుతి. కేవలం ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు మాత్రమే మొదట్లో ఆ సినిమాలు తీసిన మారుతి ఇప్పుడు కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు.

 

సాయి ధరం తేజ్ తో ప్రతిరోజూ పండుగే సినిమాతో హిట్టు కొట్టిన మారుతిసినిమా తర్వాత ఓ ప్రముఖ హీరోతో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక ముహుర్తం పెట్టడమే లేటు అనుకున్న టిమె లో కరోనా వచ్చింది. లాక్ డౌన్ టైంలో సమీకరణాలు అన్ని మారిపోయాయి. ఏప్రిల్ లో సినిమా స్టార్ట్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ అనుకున్న మారుతి ఇప్పుడు ఆ హీరో మరింత టైం అడుగుతుండటం వల్ల ఏం చేయాలో తోచని విధంగా ఉన్నాడట. ఆల్రెడీ ఆ హీరోకి కథ చెప్పడం అతను ఓకే చేయడం అంతా జరిగిందట. ప్రస్తుతం ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుంది. సినిమా షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.      

 

ఈ టైంలో రిస్క్ ఎందుకని ఆ హీరో మారుతిని మరో మూడు నెలలు వెయిట్ చేయమని చెబుతున్నట్టు టాక్. అదే నిజమైతే మారుతి అనుకున్న విధంగా ఈ ఇయర్ ఎండింగ్ లో సినిమా రిలీజ్ ఉండే అవకాశం లేదు. ఓ పక్క కరోనా ప్రభావం రోజు రోజుకి ఎక్కువై కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కూడా అనుకున్న విధంగా నిర్వహించే ఛాన్స్ కనిపించడం లేదు. మరి మారుతి తన నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తాడో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: