తెలుగులో యువ నటుల జోరు గురించి ప్రత్యేకించి చెప్పక్కరలేదు. బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా.. లేకుండా వచ్చినా కంటెంట్ ఉన్న మూవీతో వస్తే హిట్ కొట్టి తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ హీరోల్లో మాస్ కా దాస్ గా పేరు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది.. ఫలక్ నుమా దాస్ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ యువ హీరోముందుకు ఓ రీమేక్ సబ్జెక్ట్ వచ్చిందని సమాచారం.

IHG

 

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కదవులే’ అనే సినిమా విశ్వక్ సేన్ వద్దకు వచ్చిందని టాలీవుద్ సమాచారం. ఈ సినిమా హక్కులను పీవీపీ సంస్థ పొందిందని తెలుస్తోంది. ఈ కథకు విశ్వక్ న్యాయం చేయగలడని పీవీపీ ఆలోచిస్తున్నాడట. దీంతో ఈ సినిమా విషయాన్ని విశ్వక్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే.. విశ్వక్ ఇప్పటికైతే ఏమీ సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. తాను హీరోగా నటించి దర్శకత్వంల కూడా చేసిన ఫలక్ నుమా దాస్ కూడా ఓ మళయాళ సినిమాకు రీమేక్. మళ్లీ ఇప్పుడు రీమేక్ అవసరమా అని విశ్వక్ భావిస్తున్నాడని తెలుస్తోంది. ఈ వార్తలపై పూర్తి అఫిషియల్ న్యూస్ రావాల్సిందే.  

IHG

 

తమిళ్ లో అశోక్ సెల్వన్ – రితికా సింగ్ జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తమిళ్ క్రేజీ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ గెస్ట్ రోల్ లో నటించాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వథ్ మరిముత్తుకు ఇదే తొలి సినిమా. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు అశ్వథ్. దీంతో ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో నిర్మించాలని పీవీపీ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: