టాలీవుడ్ లోసూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.  స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్. కెరీర్ బిగినింగ్ లో రజినీకాంత్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే.  అప్పట్లో ఆయన నటించిన సినిమాల్లో సహ నటుడిగా కమల్ హాసన్ కూడా నటించారు. తమిళ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు భారతీ రాజ.. ఆయన దర్శకత్వంలో ఎన్నో ప్రేమ, కుటుంబ కథా చిత్రాలు వచ్చాయి. తాజాగా  గ్రామీణ వాతావరణంలో సరికొత్త కథాంశంతో దర్శకుడు భారతీ రాజా రూపొందించిన మూవీ పదినారు వయదినిలే'. 1977లో తమిళంలో వచ్చిన సినిమా లో  కమలహాసన్, రజనీకాంత్, శ్రీదేవి నటించారు.  ఈ మూవీలో నటించిన ముగ్గురు నటులు తర్వాత కాలంలో సూపర్ స్టార్లుగా మారారు.

 

గ్రామీణ వాతావరణంలో చాలా సింపుల్ గా కమల్ హాసన్, శ్రీదేవి నటించారు. వీరి నటన ఎంతో అమాయకంగా ఉంటుంది. అందుకే ఈ మూవీ  శ్రీదేవి, కమల్, రజనీలకు ఎంతో పేరుతెచ్చింది.  ఇళయరాజా సంగీతం ఉర్రూతలూగించింది. ప్రేక్షకులకు బాగా నచ్చేయడంతో సూపర్ హిట్టయింది. ఆ వెంటనే దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో దీనిని 'పదహారేళ్ల వయసు' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. చంద్రమోహన్, మోహన్ బాబు, శ్రీదేవి నటించగా, ఇది కూడా సూపర్ హిట్టయింది.

 

అప్పట్లో ఎన్నో సినిమాలు డబ్ అయ్యాయి.. కానీ ఈ మూవీ కాలేదు. తమిళ వెర్షన్ అయిన 'పదినారు వయదినిలే' మూవీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులోకి అనువదిస్తున్నారు.ఈ తెలుగు అనువాదానికి  'నీకోసం నిరీక్షణ' అనే టైటిల్ని నిర్ణయించినట్టు నిర్మాత బామారాజ్ తెలిపారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ముప్పై నిమిషాల నిడివి గల దృశ్యాలకు కాస్త మార్పులు చేసినట్టు ఆయన చెప్పారు. త్వరలో ఈ మూవీని ఓటీటీ ద్వారా విడుదల చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: