ప్రపంచంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ఆ సమయంలో ఓట్లు వేసే వారికి పండగ అంటారు. ఎన్నికల్లో నిలబడ్డ నాయకులు వారి సమర్థ్యాన్ని బట్టి డబ్బులు, ఇతర వస్తువుల రూపేన పంపిణీ చేస్తూ ఓట్లు దండుకుంటారు.  ఇది ప్రతి ఐదు సంవ్సరాల నిత్యం జరిగే తంతే.  అయితే ఎన్నికల సమయంలో సామాజిక కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తారు.. కానీ తీరా ఓటు వేసే సమయానికి దేనికోదానికి ప్రలోభ పడుతుంటారు.  అలా ఎన్నికల్లో గెలిచిన వారు ఐదు సంవత్సరాలు ప్రజల వద్ద నుంచి రాబడుతుంటారు.  ఇది జగమెరిగిన సత్యం అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తాజాగా టాలీవుడ్ నటి పూనమ్ కౌర్  అవినీతి అనే అంశంపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు.

 

అవినీతి గురించి కొందరు చెప్పిన అభిప్రాయాలు బాగానే ఉన్నాయని, అయితే, మనకందరికీ ఇన్ని విషయాలు తెలిసి కూడా అవినీతి రహితులకు ఎందుకు ఓట్లు వేయలేకపోతున్నామని పూనమ్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పూనమ్ మాట్లాడుతూ.. నాకు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏం, అవినీతి మచ్చలేని వ్యక్తులు మనకు నేతలుగా పనికిరారా? సమాధానం చెప్పండీ! దేశం మొత్తాన్ని అడుగుతున్నాను.

 

మనం ఎన్నుకునే నాయకులు మనల్ని దోచేస్తారని తెలిసి అలాంటి అవినీతి పరులను ఎందుకు అందలం ఎక్కిస్తారు.. మంచివాళ్లు రాజకీయాల్లో నెగ్గలేకపోతున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అంటూ తన సోషల్ మాద్యమంలో స్పందించారు. ఇలా మనం చేస్తున్న తప్పులు చివరికి మనల్నే బలి చేస్తుందన్న విషయం గమనించి ఓటర్లు సమయస్ఫూర్తితో ఉండాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: