భారతీయ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుల లిస్టులో మొదటి వరుసలో ఉండే పేరు కమల్ హాసన్. ఆయన కెరీర్లో ఎన్ని విభిన్నమైన పాత్రల్లో నటించారో చెప్పడం కష్టం. ప్రతి సినిమాలో తన క్యారెక్టర్, గెటప్పులో కొత్త చూపించడమే ఆయన విజయ రహస్యం. అత్యంత ప్రతిభావంతుడైన కమల్ హాసన్ చేసిన అమోఘమైన ప్రయోగం ‘దశావతారం’ సినిమా. ఈ సినిమాలో ఆయన పది పాత్రల్లో నటించడం ఓ సంచలనం. తెలుగులో ఏఎన్నార్ ‘నవరాత్రి’లో తొమ్మిది పాత్రలు చేస్తే.. కమల్ ఏకంగా పది పాత్రలు చేసి ఆ రికార్డును చెరిపేశారు. ఈ సినిమా విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా 2008 జూన్ 13న విడుదలైంది. ఈ సినిమాలో కమల్ హాసన్ రంగరాజ నంబి, గోవింద్ రామస్వామి, జార్జి బుష్, అవతార్ సింగ్, క్రిస్టియన్ ఫ్లెచర్, షింఘేన్ నరహసి, కృష్ణవేణి, విన్సెంట్ ఊవరాగన్, కలీపుల్లా ఖాన్, బలరాం నాయుడు.. పాత్రల్లో నటించారు. ప్రతి పాత్రలో కమల్ కనిపించకుండా.. క్యారెక్టర్లు మాత్రమే కనిపించే విధంగా నటించాడు కమల్. క్యారెక్టర్ కు తగ్గట్టు ఎత్తు, బరువు, ముఖాకృతి.. ఇలా ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు కమల్. దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు ప్లస్ అని చెప్పాలి.

IHG

 

12వ శతాబ్దంలో శైవులకు, వైష్ణవులకు మధ్య గొడవలు జరిగే కథాంశంతో మొదలై నేటి కాలంలో కథ ముగిస్తుంది. అంచనాలకు తగ్గ స్థాయిలో విజయం దక్కకపోయినా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కమల్ కు జోడీగా ఆసిన్ నటించింది. జయప్రద, మల్లికా శెరావత్ కూడా ఇతర పాత్రల్లో కనిపిస్తారు. హిమేష్ రేష్మియా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంద్రన్ ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: