నందమూరి బాలకృష్ణ 106వ సినిమాను బోయపాటి శ్రీను డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే బిబి 3 అంటూ టీజర్ తో సర్ ప్రైజ్ చేశాడు బాలకృష్ణ. ఈ సినిమాను మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సిం హా, లెజెండ్ సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబోగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. 

 

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఎవరు నటిస్తారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అంజలిని ఫైనల్ చేసినట్టు చెబుతున్నా అది కూడా అఫిషియల్ కాలేదు. అయితే ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా సరే కాజల్ అగర్వాల్ చేయనని చెప్పేసిందట. ఇంతకుముందు కూడా బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా సరే రెమ్యునరేషన్ ఎక్కువ అడిగి చేయనని చెప్పిందట కాజల్. ఇక ఇప్పుడు కూడా బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో కూడా కాజల్ అగర్వాల్ ఛాన్స్ మిస్ చేసుకుందట.

 

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాలంటే కాజల్ 2 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. అందుకే ఆమెను కాదని మరో హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. అది ఎవరన్నది ఇంకా తెలియలేదు. బాలయ్యతో నటించే ఇష్టం లేకనే కాజల్ ఇలా రెమ్యునరేషన్ సాకు చెప్పి తప్పించుకుంటుందని అంటున్నారు. మెగస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా కాజల్ నటిస్తుంది. చిరు రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సినిమాలో కూడా ఆమె చిరుతో రొమాన్స్ చేసింది. మరి బాలకృష్ణతో కాజల్ ఎప్పటికి చేయదా లేదా.. కేవలం రెమ్యునరేషన్ కారణంగానే కాజల్ బాలయ్యతో చేయట్లేదని టాక్.              

 

మరింత సమాచారం తెలుసుకోండి: